Begin typing your search above and press return to search.

పాదయాత్ర సక్సెస్ అయినట్లేనా..??

By:  Tupaki Desk   |   24 Sep 2022 2:52 PM GMT
పాదయాత్ర సక్సెస్ అయినట్లేనా..??
X
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో సోలో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న నాగశౌర్య.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో స్వీయ నిర్మాణంలో నటించిన ‘ఛలో’ చిత్రంతో తన కెరీర్ లో భారీ హిట్‌ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'అశ్వథ్థామ‌' యావరేజ్ ఫలితాన్ని అందించగా.. గతేడాది విడుదలైన ‘వరుడు కావలెను’ ‘లక్ష్య’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈసారి హిట్‌ కొట్టాలని ''కృష్ణ వ్రింద విహారి'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య - షిర్లే సెటియా జంటగా నటించిన చిత్రం ''కృష్ణ వ్రింద విహారి''. హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఉషా ముల్పూరి ఈ సినిమాని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీ.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సున్నితమైన సాదారణ కథతో ఎక్కడా బోర్ కొట్టకుండా.. కొత్త రకం సీన్స్ మరియు కామెడీతో రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి'.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనిపించుకుంది. ముఖ్యంగా ఇందులో హీరో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా మంచి అభినయం చూపించారు. చక్కటి లుక్స్ - స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అన్ని సన్నివేశాల్లోనూ మంచి ఈజ్ తో నటించాడు. కథలో కీలకమైన ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించాడు.

సినిమా గురించి జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి.. ఈ వీకెండ్ లో మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. ఇది చాలా గ్యాప్ తర్వాత నాగశౌర్య కు మంచి రిలీఫ్ ఇచ్చే విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కోసం యువ హీరో చాలా కష్టపడ్డాడు. ప్రొడక్షన్ చేసుకోవడమే కాదు.. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడనికి ఎంత చేయాలో అంత చేసాడు.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత దూకుడుగా ప్రమోషన్స్ చేసిన శౌర్య.. 'కృష్ణ వ్రింద విహారి' కోసం వెరైటీగా పాదయాత్ర చేసాడు. తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాడనికి పలు ప్రధాన నగరాల్లో నడుచుకుంటూ వెళ్లి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. పాదయాత్ర చేసి కూడా సినిమాని ప్రమోట్ చేయొచ్చని నిరూపించాడు.

సాధారణంగా రాజకీయ నాయకులు ఇలాంటి పాదయాత్ర చేస్తుంటారు. అయితే నాగశౌర్య మాత్రం రెగ్యులర్ ప్రమోషనల్ స్ట్రాటజీలకు పూర్తి భిన్నంగా ప్రచారం చేసాడు. ఒక చిత్రం కోసం పాదయాత్ర చేయడమనేది సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇప్పుడు సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి శౌర్య పాదయాత్ర సక్సెస్ అయినట్లే అని అందరూ చెప్పుకుంటున్నారు.

'కృష్ణ వ్రింద విహారి' తో ట్రాక్ లోకి వచ్చిన నాగశౌర్య.. రాబోయే సినిమాలతో ఇదే కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. శౌర్య ఇప్పటికే శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అలానే కె.పి. రాజేంద్ర డైరెక్షన్ లో 'పోలీసు వారి హెచ్చరిక' అనే సినిమా అనౌన్స్ చేసాడు. శ్రీమాన్ దర్శకత్వంలో '#NS24' ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టాడు. మరి ఇప్పుడు KVV సక్సెస్ తర్వాత శౌర్య లైనప్ లో మార్పులు చోటుచేసుకుంటాయేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.