Begin typing your search above and press return to search.

కృష్ణవంశీ సినిమాకి కొండంత సాయం

By:  Tupaki Desk   |   17 March 2023 10:00 PM GMT
కృష్ణవంశీ సినిమాకి కొండంత సాయం
X
క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునన్ దర్శకుడు అంటే కృష్ణ వంశీ అని చెప్పాలి. మిగిలిన దర్శకులకి భిన్నమైన టేకింగ్ తో ఆయన సినిమాలు ఉంటాయి. అందుకే క్రియేటివ్ డైరెక్టర్ అనే బ్రాండ్ అతనికి ఇచ్చారు. అతని కెరియర్ చేసిన సినిమాలలో అయితే బ్లాక్ బస్టర్ హిట్ లేదంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే విధంగా చాలా వరకు ఉంటాయి. నిన్నే పెళ్ళాడతా, అంతఃపురం, సిందూరం, గులాబి, ఖడ్గం, చందమామ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టారు.

అలాగే చక్రం, రాఖీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు. ఆయా సినిమాలలో ప్రభాస్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని చెప్పాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో చేసిన గోవిందుడు అందరివాడెలే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ మూవీ తర్వాత చాలా కాలానికి నక్షత్రం అనే సినిమా చేశాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత మరల ఐదేళ్ళు గ్యాప్ తీసుకొని రంగామర్తాండ సినిమాతో మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకి సంబందించిన సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉన్న మూవీపైన మాత్రం ఇప్పటి వరకు సరైన బజ్ లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే రెండేళ్ళు అయినా కూడా ఆర్ధిక కారణాల వలన మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఫైనల్ గా ఈ మూవీని రిలీజ్ స్టేజ్ కి తీసుకొని వచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా సినిమాని టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫిల్మ్ జర్నలిస్టులు అందరూ ప్రమోట్ చేస్తున్నారు. సినిమా చూసి ట్విట్టర్ లో వీడియోలు, ట్వీట్ లు పెడుతున్నారు.

ఇలా టాలీవుడ్ లో దర్శకులు, నటులు అందరూ కూడా మూవీని దగ్గరుండి ప్రమోట్ చేస్తూ ఉండటం విశేషం. కృష్ణవంశీ మీద ఉన్న అభిమానంతో తెలుగు వారందరూ ముందుకొచ్చి ప్రమోట్ చేయడం గొప్ప విషయం అని చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం గౌరవం, అలాగే అతని సినిమాల మీద ఉన్న రెస్పెక్ట్ తో ఇలా అందరూ ముందుకి వస్తున్నట్లు తెలుస్తుంది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తున్న రంగామార్తాండ మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.