Begin typing your search above and press return to search.

ఎవరు ఎదురుచూస్తున్నారు క్రిష్

By:  Tupaki Desk   |   27 May 2019 9:36 AM GMT
ఎవరు ఎదురుచూస్తున్నారు క్రిష్
X
సాధారణంగా ఎవరికి ఎదురుకాని విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ దెబ్బ తినడం ఏ మాత్రం ఊహించనిది. పైగా నిర్మాతగా అంతరిక్షం సైతం చేదు ఫలితాన్నే ఇచ్చింది. ఇవి చాలవు అన్నట్టు మణికర్ణిక విషయంలో కంగనా రౌనత్ తో పడిన గొడవ బాలీవుడ్ సర్కిల్స్ లో కొంత ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. అందుకే గత కొంత కాలంగా మీడియాకు దొరకకుండా ఉన్న క్రిష్ ఇటీవలే జెర్సీ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి బయటికి వచ్చాడు.

అది అయ్యాక కొత్త సినిమా గురించి ఏమైనా చెబుతాడేమో అని ఎదురు చూస్తే ఎలాంటి కబురు షేర్ చేయలేదు. దానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తన ఇంకో తప్పటడుగు వేస్తానేమో అని కొందరు ఎదురుచూస్తున్నారని చీకట్లో బాణాలు వేసే వాళ్ళు ఉన్నారని కొత్త సినిమా గురించి ఏమి ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చాడు

ఇక్కడ క్రిష్ ప్రస్తావించింది కంగనా బ్యాచ్ గురించే అనడంలో సందేహం అక్కర్లేదు. బాలకృష్ణతో ఉన్న అనుబంధం దృష్ట్యా నెగటివ్ గా అనుకోవడానికి లేదు కానీ క్రిష్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనేదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఓ యంగ్ హీరోతో ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజి లో ఉందనే టాక్ ఉంది కానీ క్రిష్ ఇప్పటికిప్పుడు ఏమి చెప్పేలా లేడు. అయినా అభిరుచి కలిగిన దర్శకుడికి ఇలా వరస దెబ్బలు తగిలినప్పుడు ఈ మాత్రం గ్యాప్ రావడం సహజం.