Begin typing your search above and press return to search.

NTR30: కొరటాల కొట్టాల్సిందే!

By:  Tupaki Desk   |   24 March 2023 10:00 AM GMT
NTR30: కొరటాల కొట్టాల్సిందే!
X
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి రీచ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలు అఫీషియల్ గా లాంచ్ అయింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ మరింత గ్రాండ్ గా ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. చాలా కాలంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని వెయిట్ చేస్తున్న జాన్వీ కపూర్ కి ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రంతో ఆ అద్భుత అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో కొరటాల శివపైన చాలా బరువైన బాధ్యతలు ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమా కంటే ముందుగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ చిత్రంగా ఆచార్య సినిమాని ప్రేక్షకులకు అందించారు.

ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన మొదటి రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని రెండు రోజుల్లోనే మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. సినిమాలో బలమైన కథ నేపథ్యం లేకపోవడం పాత్రలని కూడా బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించకపోవడంతో మెగాస్టార్ అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలోని కనెక్టివిటీ అనేది అస్సలు లేదనే మాట విమర్శకుల నుంచి వచ్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ బాధ్యత అంతా కొరటాల శివ మీదికి వెళ్లిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం పరోక్షంగా కొరటాలను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.

పలు సందర్భాలలో ఆచార్య ఫెయిల్యూర్ కి కారణం కొరటాల శివ నిర్లక్ష్యం అనే విధంగా చిరంజీవి చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. కొత్త దర్శకుడు అయితే కచ్చితంగా ఈ డ్యామేజ్ కి తన కెరియర్ ని పూర్తిగా పోగొట్టుకునేవాడే. కానీ ఆచార్య కంటే ముందు ఏకంగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొరటాల శివ అందించారు. ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. ఇక కొరటాల కోసం ఏకంగా ఏడాది కాలం తారక్ వెయిట్ చేశారు. మంచి కథను సిద్ధం చేసేందుకు కొరటాలకు కావలసినంత సమయం ఇచ్చాడు.

ఓ విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని తారక్ తీసుకువెళ్లి కొరటాల చేతిలో పెట్టారు. మరోవైపు కొరటాలను నమ్మి అతను ఫ్రెండ్ నిర్మాతగా భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. మొదటిసారి కొరటాల శివ పాన్ ఇండియా సినిమాని డీల్ చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడిపైనే అందరూ పెద్ద బాధ్యతలు పెట్టారు. ఓ విధంగా చెప్పాలంటే కొరటాల శివ ఇమేజ్ కి మించి తనపై బరువు వేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. మరి ఆ బాధ్యతలకి కొరటాల పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడా అనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.