Begin typing your search above and press return to search.

NTR30 : ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ని చిరాకు పెట్టకుండా కొరటాల ప్లాన్స్‌

By:  Tupaki Desk   |   6 Feb 2023 2:06 PM GMT
NTR30 : ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ని చిరాకు పెట్టకుండా కొరటాల ప్లాన్స్‌
X
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల అవ్వక ముందే ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబో మూవీ ప్రకటన వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీర్‌ సినిమా ప్రారంభం అవుతుందని అంతా భావించారు. కానీ కొరటాల శివ ఆచార్య ఫలితం నేపథ్యంలో ఎన్టీఆర్‌30 సినిమా ఆలస్యం అయ్యింది.

గత ఏడాది చివర్లో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయిన సమయంలో కొరటాల శివ కన్ఫర్మ్‌ చేశాడు. ఫిబ్రవరిలో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లుగా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించాడు.

కానీ కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాదిలో ఎన్టీఆర్‌ సినిమా లేకుండా అయ్యింది. అందుకే మరీ ఆలస్యం కాకుండా.. ఎన్టీఆర్‌ వెంటనే మరో సినిమాను చేసుకునే విధంగా కొరటాల శివ ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ తో చేయబోతున్న సినిమా షూటింగ్ ను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేశాడట. అంతే కాకుండా ఎన్టీఆర్‌ యొక్క అభిమానులకు చిరాకు తెప్పించకుండా రెగ్యులర్‌ గా సినిమా యొక్క అప్డేట్ ను ఇస్తూ వస్తాడట. ఇప్పటికే ప్రకటించిన తేదీ అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నారట.

స్క్రిప్ట్‌ వర్క్ విషయంలో ఎన్టీఆర్ ను సంతృప్తి పర్చిన దర్శకుడు కొరటాల శివ మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నాడట. అంతే కాకుండా హైదరాబాద్‌ శివారులో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్‌ ను నిర్మిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.