కొరటాల పాన్ ఇండియా రిపేర్లు చేస్తున్నారా?

Mon Jan 17 2022 09:14:00 GMT+0530 (India Standard Time)

Koratala Pan India Plan About NTR30

చూస్తుంటే ఎన్టీఆర్ 30 ఇప్పట్లో ప్రారంభం కాదని అర్థమవుతోంది. ఓమిక్రాన్ టెన్షన్స్ నడుమ సినిమాల షూటింగులకు బ్రేక్ పడుతుంటే ఎవరికి వారు ఇండ్లలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అయితే ఇదే అదనుగా కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30 స్క్రిప్టులో మార్పు చేర్పులు చేస్తున్నారని .. పాన్ ఇండియా కేటగిరీకి స్క్రిప్టును తయారు చేస్తున్నారని గుసగుసలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.ట్విట్టర్ వేదికగా తారక్ అభిమానుల్లో ఈ తరహా డిబేట్ రన్ అవుతోంది. కొరటాల స్క్రిప్టుకి రిపేర్లు చేస్తున్నారని.. ఎన్టీఆర్ 30 పాన్ ఇండియా రేంజులో ఉంటుందని కూడా డిబేట్ సాగుతోంది.

ఇంతకీ ఈ సినిమా ఎప్పటికి ప్రారంభమవుతుంది? అంటే... ఏప్రిల్ నాటికి కానీ ఓమిక్రాన్ తగ్గదు. అప్పుడే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి కొరటాల ఇప్పటికీ ఆచార్య చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ లో క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నారని .. ఫైనల్ ఎడిట్ లో చాలా రీవర్క్ చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల తెరకెక్కించనున్న  తాజా చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా నటిస్తుందని కూడా అభిమానుల్లో వైరల్ అవుతోంది. అయితే ప్రతిదీ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.