తేడా వస్తే కోన ఫుల్ గా తినేస్తాడు

Thu Dec 03 2015 23:00:01 GMT+0530 (IST)

Kona Venkat on Shankarabharanam Movie

ఇప్పటికే బ్రూస్ లీ సినిమా హిట్టవ్వకపోవడానికి కారణం తాను రాసిన సీన్లన్నీ శ్రీను వైట్ల తీసుకోకపోవడమే అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే అఖిల్ సినిమాకు తాను మాటలు మాత్రమే రాశానని.. సో ఫ్లాప్ విషయంలో తనకు సంబంధం లేదని చెప్పేశాడు. స్ర్టయిక్ అయ్యారుగా ఆయనెవరో.. ది పాపులర్ రైటర్ కోన వెంకట్.కట్ చేస్తే.. మరొ కొన్ని గంటల్లో 'శంకరాభరణం' సినిమా రిలీజ్ అవ్వబోతోంది. నిఖిల్ - నందిత హీరో హీరోయిన్లుగా.. యావత్ టాలీవుడ్ పాపులర్ గ్యాంగ్ అంతా కలసి రచ్చ చేసిన.. ఈ బీహార్ క్రైమ్ కామెడీకి కర్త కర్మ క్రియ మన గురువుగారే. నిజానికి ఇది ఒక హిందీ సినిమా రీమేక్. కాబట్టి దాంట్లో పెద్దగా చేసేదే ఏముంటుంది? అయినాసరే శంకరాభరణం కోసం కేవలం రా కాన్సెప్టు మాత్రమే తీసుకొని మిగిలినదంతా నేనే వండాను అంటున్నాడు కోన. ఇప్పుడు కనుక సినిమా హిట్టయ్యిందనుకోండి.. ఖచ్చితంగా ఆడియన్సు కూడా.. అబ్బో కోన వెంకట్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తే సినిమాను ఉతికి ఆరేస్తాడు అనే ఫీలింగ్ కు వచ్చేస్తారు.

ఒకవేళ తేడా పడితే.. బ్రూస్ లీ - అఖిల్ విషయంలో మనోడు ఇతరులపై చేసిన కామెంట్లన్నీ ఇప్పుడు వడ్డీతో సహా తినేస్తాడు. యావత్ టాలీవుడ్ అందుకే డిసెంబర్ 4 ఎప్పుడొస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తోంది మరి.