కోలీవుడ్ కింగ్ విజయ్… రికార్డుల మోత!

Tue Feb 07 2023 10:08:38 GMT+0530 (India Standard Time)

Kollywood King Vijay... the number of records!

తమిళంలో ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఈ స్థాయిలో అయితే మాస్ ఫాలోయింగ్ ఉందో తమిళంలో విజయ్ కి కూడా అలాగే ఉంది. అతను మాట్లాడేది తక్కువే అయితే విజయ్ మేనరిజమ్.ఆటిట్యూడ్ కి తమిళియన్స్ విపరీతంగా అభిమానులుగా మారిపోతూ ఉంటారు. మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా విజయ్ ని అభిమానిస్తూ ఉంటారని అతని సినిమాలకి వచ్చే ప్రేక్షాకధారణ చూస్తేనే తెలుస్తుంది.

ఇక ఈ మధ్యకాలంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా కోలీవుడ్ లో అతను మాత్రమే కొనసాగుతున్నాడు. తెలుగులో మహేష్ బాబు ఎలా అయితే శ్రీమంతుడు తర్వాత వరుస సక్సెస్ లతో జర్నీ చేస్తున్నాడో. అలాగే విజయ్ కూడా గత ఐదేళ్ళ కాలంలో ఫ్లాప్ లేకుండా సూపర్ హిట్స్ తోనే ట్రావెల్ అవుతున్నాడు. థియేటర్ లో విజయ్ సినిమా పడింది అంటే వందకోట్ల షేర్ అని చాలా ఈజీగా వచ్చేస్తుంది.

ఇక ఆయన సినిమా బడ్జెట్ కూడా వారం రోజుల్లోనే కలెక్ట్ చేసేస్తుంది.చాలా సినిమాలు నిర్మాతలకి మంచి టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చాయి. తాజాగా వచ్చిన వారిసుతో సహా.

గత కొన్నేళ్ళ నుంచి విజయ్ సినిమాల కలెక్షన్స్ షేర్ చేసుకుంటే మొదటి స్థానంలో మాస్టర్ మూవీ ఉంది. ఇది 141కోట్ల షేర్ రాబట్టింది. తరువాత బిగిల్ 139 కోట్ల షేర్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో 137 కోట్ల షేర్ తో వారిసు నిలవడం విశేషం. తరువాత సర్కార్ 125 కోట్ల షేర్ ని రాబట్టింది. మెర్సల్ మూవీ 120 కోట్ల షేర్ రాబట్టింది. బీస్ట్ మూవీ 113 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో బీస్ట్ మూవీకి కాస్తా ఆరంభంలో నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే లాంగ్ రన్ లో సినిమా మంచి షేర్ రాబట్టి హిట్ బొమ్మగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.