Begin typing your search above and press return to search.

గ‌ద్ద ముక్కు పంతులు తొలి జీతం రూ.10

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:30 PM GMT
గ‌ద్ద ముక్కు పంతులు తొలి జీతం రూ.10
X
ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌.. న‌టుడు.. సాహితీవేత్త‌.. జ‌ర్న‌లిస్ట్ .. బ‌హుముఖ ప్రజ్ఞాశాలి గొల్ల‌పూడి మారుతీరావు మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. కెరీర్ లో దాదాపు 280 చిత్రాల‌కు ప‌ని చేసిన ఆయ‌నలోని విల‌క్ష‌ణత వేరే ఎవ‌రికీ సాధ్యం కాదేమో. గ‌ద్ద ముక్కు పంతులుగా.. సింగిల్ పూరి శ‌ర్మ‌గా ..ఇంకా ఎన్నో పేరు పెట్టి పిలిచే పాత్ర‌ల్లో న‌టించిన మారుతీరావుకు స్టేజీ డ్రామా అన్నా .. సాహిత్యం అన్నా ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఆయ‌న గొప్ప‌గా న‌టించ‌లేద‌ని అన్నా ఫీల‌వ్వ‌రు కానీ.. బాగా రాయ‌లేదు అంటే మాత్రం ఈగో ఫీల‌య్యేవార‌ట‌. ర‌చ‌న అంటే ఆయ‌న‌కు అంత గొప్ప అభిమానం.

ఒకానొక ఇంట‌ర్వ్యూలో ఆయ‌నంత‌ట ఆయ‌నే కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిపారు. దాదాపు 280 పైగా సినిమాలు చేసినా చూడగానే గుర్తుకువచ్చే పేర్లు రెండే రెండు. సింగిల్ పూరీ శర్మ. గద్దముక్కు పంతులు పేరు నాకు నేను రాసుకున్నది కాదు. నాకు గద్దముక్కు పంతులు పేరు పెట్టింది కోడి రామక్రిష్ణ అని తెలిపారు. మారుతిరావు తొలి సినిమా `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`. రెండో సినిమాకే గ‌ద్ద ముక్కు పంతులు పేరొచ్చింద‌ట‌.

మారుతీరావు ఏనాడూ సినీ రచయిత అవ్వాలని అనుకోలేదు. అలాగే నటుడు కావాలనుకోలేదు. ఇవన్నీ తప్పసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయాయి. ``నా 42 వ ఏట నేనే నటుడినయ్యా. 42వ ఏట సినిమా ఎందుకయ్యా.. పోవయ్యా!`` అని నన్ను నేను అనుకునేవాడిని అని మారుతిరావు వెల్ల‌డించారు. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్ధాల్లో 280 పైగా సినిమాలు చేరాయ‌న‌. ఎప్పుడు కెరీర్ లో డబ్బుకు వెతుక్కోలేదని దానికోసం శ్ర‌మ ప‌డ‌లేద‌ని ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అందుకే ఆదాయం కోసం నా ఆర్ట్‌ ని కాంప్రమైజ్ చేయలేదు అంటూ నిబ్బ‌రంగా చెప్పారు గ‌ద్ద‌ముక్కు పంతులు. కెరీర్ ఆరంభం రూ.10 కి క‌థ‌లు రాసిన సంద‌ర్భం ఉంద‌ట‌. సంవ‌త్స‌రానికి 31 సినిమాలు చేసిన అనుభ‌వం ఉంది. అయితే అంత బిజీ వ‌ల్ల రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ షూటింగులేమిటో అంటూ ఏడ్చిన సంద‌ర్భాలున్నాయ‌ని తెలిపారు.