జూనియర్ తో కిరీటి ఇంప్రెస్ చేశాడుగా!

Fri Sep 30 2022 12:06:53 GMT+0530 (India Standard Time)

Kiriti impressed with Junior!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిజినెస్ మెన్ పొలిటికల్ లీడర్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. వారాహి చలన చిత్రం బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఈ ఓ మూవీని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలల క్రితం బెంగళూరులో భారీ స్థాయిలో మొదలైన విషయం తెలిసిందే. శుక్రవారం కిరీటి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి 'జూనియర్' అనే టైటిల్ ని ఖరారు చేశారు.ఈ సందర్భంగా కిరీటి డైలాగ్ చెబుతున్న టైటిల్ వీడియోని శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సందర్భంగా కిరీటి స్కేటింగ్ చేస్తున్న విన్యాసాలని చూపించి ఆకట్టుకున్నారు. ఇప్పడు అతని డైలాగ్ డెలివరీతో పాటు టైటిల్ లాంచ్ వీడియోని విడుదల చేశారు. మొదటి నుంచి ఈ మూవీ ప్రమోషనల్ వీడియోలని విబిన్నంగా విడుదల చేస్తున్న మేకర్స్ టైటిల్ రిలీజ్ కు కూడా అదే పంథాని అనుసరించారు.

చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా లైఫ్ మనల్ని ఏదో ఒకటి చేసేస్తుంది. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మన జనరేషన్ కి ఆప్షన్స్ చాలా ఎక్కువ. ఇక బ్యాడ్ న్యూస్ అంటారా ..ఈ జనరేషన్ లో నేను వున్నా లేనట్టే..అర్రే..

ఎప్పేశానా? చెప్పినట్టు నేనే మర్చిపోతా.. విన్నట్టు మీరూ మర్చిపోండే..ప్లీజ్.. లైఫ్ లో ఇన్ని ఆప్షన్ లు వున్నప్పుడు ఏదో సాధించిన వాళ్లు వున్నారు.. ఏదో ఒకటిలే అని ఆగిపోయిన వాళ్లూ వున్నారు.. ఏదీ చేయలేకా ఓడి మిగిలిపోయిన వాళ్లూ వున్నారు.. కానీ వీళ్లందరు మొదలు పెట్టినప్పుడు తెలియని నమ్మకంతో అమాయకంగా ఉదైనా చేసేద్దాంలే అనే తొడగొట్టే స్టేజ్ ఒకటి వుంటుంది.. ఆ స్టేజ్ పేరే...జూనియర్' అంటూ కిరీటి కాన్సెప్ట్ ని వర్ణించిన తీరు ఆకట్టుకునేలా వుంది.

టైటిల్ వీడియోతో కిరీటి రెడ్డి డైలాగ్ చెప్పగల సామర్థ్యాన్ని ఇండైరెక్ట్ గా బయటపెట్టారు. ట్రెండీ డ్రెస్ లో కిరీటి కాలేజీ బ్యాగ్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మోడ్రన్ యూత్ గా కనిపిస్తూనే నేటి తరం ఆలోచనా ధోరణీ కిరీటీ డైలాగుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. టైటిల్ వీడియోతో తన డైలాగ్ లతో కిరీటి ఇంప్రెస్ చేశాడు.  సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఏదైనా సాధించాలనే యువకుడిగా కనిపించనున్నట్టుగా తెలుస్తోంది.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డైలాగ్ టైటిల్ వీడియోకు దేవి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెనీలియా కన్నడ నటుడు రవిచంద్ర కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి పీటర్ హెయిన్ సినిమాటోగ్రఫీ కె.కె. సెంథిల్ కుమార్ ప్రాజెక్ట్ డిజైనర్ రవీందర్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.