Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం.. స్టైలు మారింది.. లుక్కు మారింది!

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:00 PM GMT
కిరణ్ అబ్బవరం.. స్టైలు మారింది.. లుక్కు మారింది!
X
యంగ్, టాలెంటెడ్ టాలీవుడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. కిరణ్ ని చూడగానే మన పక్కింటి అబ్బాయిని చూసిన అనుభూతి కలుగుతుంది. తను ఎంచుకునే సినిమాలు కూడా అలానే ఉంటాయి. రాజావారు, రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కుర్రాడు, వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతున్నాడు. మొదటి సినిమాలు చాలా అమాయకంగా కనిపించిన కిరణ్, రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో అదరగొట్టాడు.

ఈ కుర్రాడిలో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ మూవీతో ఒక్కసారి గా అందరికీ తానేంటో నిరూపించాడు. ఈ క్రమంలో వరసగా అవకశాలు అందిపుచ్చుకుంటున్నాడు. అయితే, సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

ఇప్పటి వరకు కిరణ్, తన సినిమాల విషయంలో డిపరెంట్ జోనర్స్ ఎంచుకున్నాడు. కానీ తన లుక్స్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అన్నింట్లోనూ ఒకేలా కనిపించేవాడు. కానీ, తొలిసారి తన లుక్స్ తో మెస్మరైజ్ చేశాడు. స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

స్టైలిష్ లుక్ లో, డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ గా మరాయి. ఈ కొత్త లుక్ చాలా బాగుందంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంత ట్రెండీ మేకోవర్ లో ఇప్పటి వరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండీ లుక్ అదిరిందంటున్నారు. ఏదైనా కొత్త సినిమా కోసం ఇలాంటి మేకోవర్ ట్రై చేశావా బ్రో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలో కిరణ్ తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చడంతో పాటు, హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ప్రయత్నించాడు.

ఇదిలా ఉండగా, చివరగా కిరణ్ అబ్బవరం మీటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో పోలీసు అధికారిగా కనిపించాడు. అయితే, ఈ మూవీ ఊహించినంత హిట్ దక్కలేదు. దీంతో, హిట్ కోసం శ్రమిస్తున్నాడు.