Begin typing your search above and press return to search.

కింగ్ ఫిష‌ర్ లుక్: వీపుపై ఓంకార నాదం ఏంటి క‌థ‌?

By:  Tupaki Desk   |   16 Dec 2019 11:26 AM GMT
కింగ్ ఫిష‌ర్ లుక్: వీపుపై ఓంకార నాదం ఏంటి క‌థ‌?
X
వీపు విమానం మోతే! అన్న‌ట్టుగా ఉంది ఈ పోస్ట‌ర్. పైగా ఆ వీపుపైన ఓంకారం సింబ‌ల్.. ఆ చేతుల‌కు రుద్రాక్ష కంక‌ణాలు చూస్తుంటే ఏదో సంథింగ్ ఉందిలే అనిపిస్తోంది. బాగా మెలితిరిగిన కండ‌ల‌తో బ్యాక్ ఫీట్ లో కొత్త హీరో లుక్ ని రివీల్ చేసారు. అంతేకాదు.. ఇదో ర‌గ్గ్ డ్ రస్టిక్ బోల్డ్ మూవీ అని ప్ర‌క‌టించ‌డంతో ఆస‌క్తి పెరిగింది. ఇంత‌కీ ఈ ప్ర‌య‌త్నం ఎవ‌రిది? అంటే...

ఇంద్ర‌-న‌ర‌సింహానాయుడు- గంగోత్రి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన చిన్నికృష్ణ అప్ప‌ట్లో ఓంకార్ తో క‌లిసి జీనియ‌స్ లాంటి ఫ్లాప్ సినిమాకి క‌థ‌ని అందించాడు. వ‌రుస‌గా ఓంకార్ తో సినిమాలు చేసి అవి ఫ్లాపులయ్యాక ఇటీవ‌ల‌ కొంత‌కాలంగా హైడ్ లో ఉన్నారు. ఈ గ్యాప్ లో ఆయ‌న క‌థ రాసుకున్న‌ట్టున్నారు. ఈసారి ఏకంగా ఓ కొత్త బ్యాన‌ర్ ప్రారంభించి నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. అంతేకాదు తొలి సినిమా టైటిల్ `కింగ్ ఫిష‌ర్` అంటూ ప్ర‌క‌టించ‌డం వేడెక్కిస్తోంది.

కింగ్ ఫిష‌ర్ బీర్ ని చూసి ఈ టైటిల్ పెట్ట‌లేదు. కింగ్ ఫిష‌ర్ ప‌క్షిని చూసి పెట్టుకున్నా. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ అభిరుచికి త‌గ్గ చిత్ర‌మిది. బోల్డ్.. రా అండ్ ర‌స్టిక్ గా క్యారెక్ట‌ర్ ని తెర‌పై చూస్తారు. అంతా కొత్త త‌రం న‌టీన‌టుల‌తో తెర‌కెక్కిస్తున్నాం. ఇప్ప‌టికే న‌టీన‌టుల ఎంపిక సాగుతోంది అని చిన్నికృష్ణ‌ తెలిపాడు. ప‌లాస 1987 ఫేం క‌రుణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇత‌ర‌త్రా వివ‌రాలు తెలియాల్సి ఉంది. చిన్నికృష్ణ ప్ర‌చారార్భాటం చూస్తుంటే...గ‌తం గుర్తుకు చేసుకోవాల్సి వ‌స్తోంది. అప్ప‌ట్లో జీనియ‌స్ స‌హా ప‌లు చిత్రాల‌కు ఇంత‌కుమించిన ప్ర‌చారార్భాటం చేశారు. అయితే ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందో తెలిసిందే. ఈసారి ద‌ర్శ‌కుడిగా మారారు కాబ‌ట్టి ఆ త‌ప్పు రిపీట్ కాకుండా కాస్త ప్రాక్టిక‌ల్ గా ఆలోచించి ట్రెండుకు త‌గ్గ‌ట్టు క్వాలిటీగా కొత్త దారిలో వెళ‌తార‌నే ఆశిద్దాం.