Begin typing your search above and press return to search.

వీడియో : 'ది ఘోస్ట్‌' కత్తి వచ్చేసింది

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:05 AM GMT
వీడియో : ది ఘోస్ట్‌ కత్తి వచ్చేసింది
X
నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నాగార్జున ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్ చూస్తే అర్థం అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా లో అత్యంత కీలకమైన పాత్రను నాగార్జున చేతిలో ఉండే కత్తి పోషిస్తూ ఉంటుందట.

ఇటీవలే ఆ కత్తి గురించి యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. జపాన్ లో మాత్రమే లభించే అత్యంత అరుదైన ఉక్కుతో ఈ ఖడ్గం ను తయారు చేయించారట.

జపాన్ లో ఈ ఖడ్గం ను కటవా అని పిలుస్తారట. ఆ కత్తికి సంబంధించిన వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

అన్నట్లుగానే నేడు ఆ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. కత్తి ని తయారు చేయడం మొదలుకుని దాన్ని ఎలా వాడారు అనే వరకు వీడియోలో చూపించారు. నాగార్జున స్వయంగా ఆ కత్తిని తయారు చేసినట్లుగా వీడియోలో చూపించడం జరిగింది. అత్యంత పదునైనా కత్తిగా కూడా దాన్ని ఇందులో చూపించారు.

మొత్తానికి ది ఘోస్ట్‌ కత్తి వచ్చేసింది. ఇక ఈనెలలోనే సినిమా యొక్క ట్రైలర్‌ ను కూడా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 5వ తారీకున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా సోనాల్ చౌహాన్ నటించింది. మొదట ఆ పాత్రకు కాజల్‌ అనుకున్నప్పటికి ఆమె తల్లి అవ్వడం వల్ల షూటింగ్ లో పాల్గొన లేక పోయింది. దాంతో సోనాల్ కి ఆ అవకాశం దక్కింది.