ఫోర్బ్స్ జాబితాలో కిమ్.. ఆస్తులు ఎంతో తెలుసా?

Thu Apr 08 2021 09:00:01 GMT+0530 (IST)

Kim on Forbes list Do you know much about assets?

'కిమ్ కర్దాషియన్..' తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించే ఈ హాలీవుడ్ భామ.. సంపాదనలోనూ తనకు తిరుగులేదని చాటి చెబుతోంది. తాజాగా మంగళవారం ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన బిలియనీర్ల జాబితాలో చోటు సాధించిందీ స్టార్.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన కిమ్.. హాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగింది. 'కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్' అనే టీవీ సిరీస్.. ఆమె క్రేజ్ ను ఆకాశానికి ఎత్తేసింది. దీంతో.. కోట్లాది మంది అభిమానులు ఆమెను ఆరాదించడం మొదలు పెట్టారు.

సోషల్ మీడియాలో కిమ్ ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోవడం ఖాయం. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెను ఏకంగా 21 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో.. వారి అభిమానాన్ని బిజినెస్ పరంగానూ ఉపయోగించుకుంటోంది కిమ్.

రియాలిటీ స్టార్ గా ఉంటూనే.. బిజినెస్ ఉమన్ గా మారిపోయిన కిమ్.. కాస్మొటిక్స్ అండ్ షేప్ వేర్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఏ ప్రొడక్ట్ రిలీజ్ చేసినా.. వాటి సేల్స్ ను అమాంతం పెంచేయడానికి సోషల్‌మీడియాలోని ఫాలోవర్లే సరిపోతున్నారు!

ఆ విధంగా బిజినెస్ లోనూ దూసుకెళ్తున్న కిమ్ ప్రస్తుతం ఆస్తి సుమారు 100 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే.. 7426 కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించిన కిమ్.. బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించింది. ఇన్నాళ్లూ తన అందంతోనే ప్రపంచాన్ని అల్లాడించిన కిమ్ కర్దాషియన్.. ఇప్పుడు బిలియనీర్ గానూ ఊపేయనుంది. కాగా.. తన భర్త  కాన్యే వెస్ట్ కు కిమ్ విడాకులు ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.