నైట్ పార్టీలో సారా టెండూల్కర్ తో కిల్లర్ బోయ్?

Tue Nov 29 2022 09:43:09 GMT+0530 (India Standard Time)

Killer boy with Sara Tendulkar in the night party?

వయసు వచ్చాక దూకుడు ఆగదు. దుందుడుకుతనాన్ని ఆపలేం. టీనేజీ నుంచి తుంటరి వయసు మొదలైనట్టు. అలాంటి సన్నివేశం ఇప్పుడు బాలీవుడ్ నటవారసురాళ్లలో బయటపడుతోంది. నిరంతరం పార్టీలు బీచ్ సెలబ్రేషన్స్ అంటూ బోలెడంత సందడి నెలకొంది. అయితే వీళ్లంతా సెలబ్రిటీ కిడ్స్ కాబట్టి పైగా రంగుల ప్రపంచంలో కథానాయికలుగా రాణించాలి కాబట్టి ఈ ప్రమోషనల్ యాటిట్యూడ్ అవసరం. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వారసురాలు సారా టెండూల్కర్ కూడా చేరింది. గత కొంతకాలంగా ఫిలింసర్కిల్స్ లో ప్రముఖ హీరోల నటవారసురాళ్లతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్న సారా టెండూల్కర్ మోడల్ గా సంచలనాలు సృష్టిస్తోంది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో తన బాలీవుడ్ స్నేహితురాళ్లతో కలిసి నటించింది. మునుముందు హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ గా రంగ ప్రవేశం చేసేందుకు ఛాన్సుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టెండూల్కర్ కుటుంబం నుంచి ఒక కథానాయిక బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్పష్టంగా సన్నివేశం చెబుతోంది.అంతేకాదు.. సారా టెండూల్కర్ నేటి టీనేజీ యూత్ లో తనదైన స్పీడ్ చూపిస్తూ నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఆసక్తికరంగా నిన్న రాత్రి సారా టెండూల్కర్ లండన్ లో ఓర్రీతో కలిసి నైట్ పార్టీలో కిల్ చేసింది. ఈ పార్టీలో తన ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. కిల్లర్ స్మైల్ తో కుర్రకారు గుండెల్లో సారా గుబులు పెంచింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లండన్ లో ఓర్హాన్ అవత్రమణి సడెన్ గా ప్రత్యక్షమవ్వడం అక్కడ సారా సహా మరికొందరు స్నేహితులతో కలిసి పార్టీలో బ్లాస్ట్ అయిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.

ఇంతకీ ఎవరీ ఓర్రీ? అంటే అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒర్రీ అని ముద్దుగా పిలుచుకునే ఓర్హాన్ అవత్రమణి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు సన్నిహిత స్నేహితుడు. అతను అజయ్ దేవగన్ కుమార్తె నైసా దేవగన్.. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ .. ఖుషీ కపూర్.. సానయా కపూర్ సహా చాలా మంది సెలబ్రిటీ గాళ్స్ తో నిరంతరం పార్టీల్లో ప్రత్యక్షమవుతుంటాడు.

అయితే ఈ గ్యాంగ్ లో చాలా మంది సారా టెండూల్కర్ కి ఒర్రీకి కామన్ ఫ్రెండ్స్ కావడంతో ఇప్పుడు ఈ లిస్ట్ లో క్రికెట్ గాడ్ కూతురు కూడా చేరింది. ఒర్రీ ఎప్పుడూ పార్టీ యానిమల్ గా స్టార్ డాటర్స్ తో తన నైట్ పార్టీల ఫోటోలు వీడియోలతో తరచుగా వెలుగులోకి వస్తుంటాడు. కాజోల్ దేవగన్ కూతురు  నైసా దేవగన్ తో అతని ఇటీవలి పార్టీ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. కాక్ టైల్ పార్టీలో వైన్ సేవిస్తూ..రుచికరమైన వంటకాలను ఆస్వాధిస్తూ.. కొవ్వొత్తుల కాంతిలో పార్టీ రంజుగా సాగిందని ఈ ఫోటోలు చూశాక అర్థమైంది.

ఓవైపు వైన్ మత్తు చిత్తు చేస్తుంటే మరోవైపు డీజే మ్యూజిక్ రంజుగా సాగింది. నైసాతో పార్టీ వ్యవహారం గురించి మర్చిపోక ముందే ఇంతలోనే అతడు మరో సెలబ్రిటీ డాటర్ తో పార్టీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒర్రీ వ్యవహారం ఇప్పుడు ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తోంది.
సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ ఒర్రీ ఆకస్మికంగా  పార్టీ చేసుకుంటూ కనిపించడంపై గుసగుసలు మొదలయ్యాయి.

సారా అనే అందాల కుందనపు బొమ్మ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఆమె చిరునవ్వు వెయ్యి ఓల్టుల విద్యుత్ కాంతిని ప్రసరింపజేస్తుంది. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో అందంతో ఆకర్షిస్తూ మిలియన్ల మంది సోషల్ మీడియా అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఫ్యాషనిస్టాగా వరుస ఫోటోషూట్లతో అలరిస్తోంది. తరచుగా స్టైలిష్ ఫోటోషూట్ల వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఓర్రీతో ఆమె పార్టీ ఫోటోలు అభిమానులలో ఆసక్తిని పెంచాయి.

సారా టెండూల్కర్ ప్రస్తుతం లండన్ లో ఉంది. అక్కడ తన తదుపరి హైయ్యర్ స్టడీస్ ని తిరిగి ప్రారంభించింది. సారా సోషల్ మీడియా అప్ డేట్ లలో లండన్ యూనివర్శిటీ కాలేజీలో చేరినట్లు వెల్లడించింది. అక్కడ ఆమె మెడిసిన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తోంది. ఇటీవల లండన్ లో తన దైనందిన జీవితం గురించి కొన్ని వరుస ఫోటోలను షేర్ చేసింది. ఇందులో కాలేజీకి హాజరవుతున్న ఫోటోలతో పాటు.. ఎక్కువ గంటలు కష్టపడి చదవడం వరకూ.. నగరంలో షికార్లు .. కాఫీ బ్రేక్‌లు... జిమ్ కి వెళ్లి కసరత్తుల చేయడం వగైరా వగైరా వ్యవహారాలు ఉన్నాయి.

ఇంతకు ముందు సారా ఒక దుస్తుల బ్రాండ్ కోసం ప్రమోషనల్ వీడియోలో కనిపించిన తర్వాత మోడలింగ్ లోకి నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి తాను ముంబై పరిశ్రమలో కథానాయిక అవుతుందని ప్రచారం కూడా గుప్పుమంది. అయితే సారా ఇప్పుడు తదుపరి హయ్యర్ స్టడీస్ ని ఎంచుకోవడంతో అలాంటి రూమర్ లకు తెరపడింది. సారా 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఇన్ స్టాగ్రామ్ లో బిగ్ స్టార్ గా మారింది. కానీ గ్లామర్ మత్తు తనకు లేదు. ప్రస్తుతం ఇంకా చదువుకోవాలని డాక్టర్ గా తన కలలను నెరవేర్చుకోవాలని కోరుకుంటోంది.

సారా ఔత్సాహిక ప్రయాణీకురాలు కూడా. ప్రపంచ దేశాలను చుట్టి రావడంలో ఎప్పుడూ ముందుంటుంది. సారా గోవాలో 2022 కొత్త సంవత్సరాన్ని స్వాగతించింది. ఈ సంవత్సరం తన పర్యటనల చార్ట్ లో థాయ్‌లాండ్ - బాలి - జర్మనీ దేశాల విజిట్ పూర్తయింది. తదుపరి 2023 సంవత్సరాన్ని స్వాగతించేందుకు స్నేహితులతో కలిసి బిగ్ ప్లాన్ లో ఉంటుందనడంలో సందేహం లేదు.

సారా గతంలో భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో ప్రేమలో పడిందని ప్రచారమైంది. అయితే ఇది కేవలం రూమర్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం సారా ఒంటరి. తనకంటూ జతగాడు ఎవరూ లేరు. పూర్తిగా తన చదువులపైనే చాలా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.