Begin typing your search above and press return to search.
ఓటీటీ వెబ్ సిరీస్ లతో పిల్లలు పాడైపోతున్నారు!
By: Tupaki Desk | 18 March 2023 11:40 AMస్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత దొరికిన సౌలబ్యాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫోన్ తో ఎంత మంచి ఉందో? అంతే చెడు ఉందన్నది మేధావర్గం మాట. ఇక సినిమా పరంగా చూసుకుంటే? ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ కట్ లేదు. ఇష్టానుసారం తీయోచ్చు..అదే తీరున రీలీజ్ చేసుకోవచ్చు. డై బైడే ఓటీటీకి ఆదరణ పెగరడంతో? కంటెంట్ పరంగానూ క్రియేటర్స్ అంతే పోటీ పడి పనిచేస్తున్నారు.
ఇక కొన్ని వెబ్ సిరీస్ ల్లో అడల్ట్ కంటెంట్ ఎలా ఉంటుందన్నది ప్రత్యేకించాల్సిన పనిలేదు. పాశ్చత్త సంస్కృతి మన దేశానికి ఎంతలా పాకిందో ఇట్టే అర్ధమవుతుంది. ముందుగా బాలీవుడ్ ఇందులో ఆరితేరింది. అక్కడ వెబ్ సిరీస్ కంటెంట్ ఏ స్థాయిలో ఉందో చూస్తునే ఉన్నాం. తాజాగా ఇప్పుడా పద్దతి టాలీవుడ్ లోనూ జోరుగానే కొనసాగుతుంది. ఇటీవలే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.
అందులో అడల్ట్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిట్లు బిట్లుగా వైరల్ అవుతున్నాయి. దీంతో తమ సిరీస్ కుటుంబంతో కలిసి చూడొద్దని నేరుగా అందులో నటించిన వారే కోరుకున్నారు? అంటే సన్నివేశం ఎలా ఉందో అద్దం పడుతుంది. తాజాగా సీనియర్ నటుడు..సెన్సార్ బోర్డ్ మాజీ చైర్మన్ శివకృష్ణ ఇలాంటి పరిస్థితిల్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`నేను సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ తరహా అంశాలపై దృష్టి పెట్టాను. ట్రైలర్స్ మొదలు అనువాద సినిమాల వరకూ సెన్సార్ జరుపుకునేలా చూడాలని లెటర్ కూడా పెట్టాను. సినిమాల్లో బూతు ఉంటే థియేటర్స్ కి వచ్చిన వారికి మాత్రమే ఆ సంగతి తెలుస్తుంది. వెబ్ సిరీస్ లు అలా కాదు. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది.
దానికి అలవాటు పడితే వాళ్లని నియంత్రిం చడం అసాధ్యంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు- వెబ్ సిరీస్ ల వల్లనే. అందువలన కచ్చితంగా వాటికి సెన్సార్ విధించాలి. నిన్న నేను ఆ వెబ్ సిరీస్ చూడలేకపోయాను .. సడెన్ గా అలాంటి సీన్ వస్తుందని మనం ఊహించలేం కదా. అంత దారుణాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. మనం ఎక్కడికి వెళ్లిపోతున్నాం అనిపించింది.
దేశం ఆర్ధికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడడం కష్టం. మనకంటూ ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ప్రపంచమే ఎంతో గొప్ప సంస్కృతిగా భావిస్తుంది.అ లాంటి దేశంలో ఇలాంటి పనులంటే? ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నా. ఈ విధానం మారాలి. సినిమా తరహాలో అన్నింటికి సెన్సార్ రిలీజ్ ముందు ఉండాలి. అభ్యంతరక..అసభ్యకర సన్నివేశాలు తొలగించిన తర్వాతే రిలీజ్ చేయాలి` అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.