Begin typing your search above and press return to search.

అర్థ‌న‌గ్న‌ ఫోటోషూట్ తో కియ‌రా సెగ‌లు

By:  Tupaki Desk   |   19 Feb 2020 4:18 AM GMT
అర్థ‌న‌గ్న‌ ఫోటోషూట్ తో కియ‌రా సెగ‌లు
X
ముంబై సోయ‌గం కియ‌రా అద్వాణీ ఇస్పీడ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎం.ఎస్.ధోని- భ‌ర‌త్ అనే నేను- విన‌య విధేయ రామా-క‌బీర్ సింగ్ - గుడ్ న్యూజ్ .. ఇలా వ‌రుస‌గా భారీ చిత్రాల్లో టాప్ హీరోల‌ స‌ర‌స‌న న‌టించింది. క‌బీర్ సింగ్ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డం తో ఇక ఈ అమ్మ‌డిని ఆపేవాళ్లే లేరు. అప్ప‌టికే బాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాల‌తో బిజీ అయి పోయింది. కిలాడీ అక్ష‌య్ వ‌రుస‌గా త‌న సినిమాల‌కు క‌మిట్ చేయించేశాడు ఈ అమ్మ‌డిని.

కియ‌రా కెరీర్ సంగ‌తి అటుంచితే.. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోనూ ఈ అమ్మ‌డి స్పీడ్ గురించి యువ‌త‌రంలో నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. నేటిత‌రం నాయిక‌ల్లో దూకుడున్న భామ‌గా పాపుల‌రైంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో నెక్ట్స్ లెవ‌ల్ అంటే ఏమిటో చూపిస్తోంది. మొన్న ఫిలింఫేర్ 2020 ఈవెంట్ లో కియ‌రా స్ట‌న్నింగ్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఇంతలోనే ఇదిగో 2020 డ‌బు ర‌త్నానీ కేలెండ‌ర్ పై త‌ళుక్కున మెరిసింది. స్టిల్ ఫోటోగ్ర‌ఫీ స్పెష‌లిస్ట్ డ‌బు ర‌త్నానీ రూపొందించిన కేలెండ‌ర్ లో కియ‌రా సంథింగ్ స్పెష‌ల్ అని ఈ ఫోటో చెబుతోంది. ఈ ఫోటోషూట్ కోసం కియ‌రా గ్లామ‌ర్ డోస్ బాగా పెంచేసింది. బాలీవుడ్ ని మునుముందు ఎదురే లేకుండా ఏలాల‌న్న ప‌ట్టుద‌ల త‌న‌లో క‌నిపిస్తోంది. అందుకే ఇలా హ‌ద్దులు చెరిపేసి అర్థ‌న‌గ్నంగా గ్లామ‌ర్ ని ఆర‌బోసింది. ఈవిడ దూకుడుకి బీ టౌన్ లో భామ‌లంతా నోళ్లు నొక్కుకున్నారు. త‌న‌లోని న‌గ్న అందాల్ని ఆవిష్క‌రిస్తూ కియ‌రా వెట్ లుక్ లో అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో బోయ్స్ లో వైర‌ల్ గా మారింది. అయితే కియ‌రా చూపు కాస్త టాలీవుడ్ పైనా ప్ర‌స‌రిస్తే బావుంటుంద‌ని యూత్ కోరుకుంటున్నారు. ఇక్క‌డ ఎవ‌రూ లేక పూజా హెగ్డే- ర‌ష్మిక మంద‌న లాంటి భామ‌ల‌కే అవ‌కాశాలు ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంది. వీళ్లంద‌రికీ చెక్ పెట్టాలంటే కియ‌రా ఇటు రావాల్సిందే! మ‌రి ఆ ప‌ని చేస్తుందా లేదా చూడాలి.