బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. జాతీయ మీడియాలో ఈమె ప్రేమ వ్యవహారం గురించి వందల కొద్ది కథనాలు వచ్చాయి. సిద్దార్థ్ మల్హోత్ర తో ఈమె ప్రేమ వ్యవహారం గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నా కూడా ఇద్దరు మాత్రం స్పందిస్తున్న దాఖలాలు లేవు. నెట్టింట వీరి ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల వీరు నటించిన సినిమాలో లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించారు. తనకు సిద్దార్థ్ తో కలిసి నటించడం ఇష్టం అంటూ చాలా సందర్బాల్లో కియారా అద్వానీ చెప్పుకొచ్చింది. అయితే అతడితో ప్రేమ విషయాన్ని మాత్రం నిర్థారించలేదు. తాము మంచి స్నేహితులం అంటూ మాత్రమే చెబుతూ వచ్చిన కియారా అద్వానీ తమ మద్య ప్రేమ లేదు అంటూ గతంలో చెప్పింది. తాజాగా మరోసారి ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్థావనకు వచ్చింది.
సిద్దార్థ్ మల్హోత్రా ఈ
విషయమై స్పందిస్తూ తనకు కియారా అంటే చాలా గౌరవం. ఆమె వర్క్ పట్ల చూపించే
శ్రద్ద మరియు ఆమె నటన నాకు చాలా ఇష్టం. తప్పకుండా అలాంటి స్నేహితులు అందరు
కోరుకుంటారు. మంచి కథలను ఎంపిక చేసుకునే క్రమంలో నాతో నటిస్తుందే తప్ప నాతో
నటించాలని ఆమెకు ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి ఎప్పుడు
అంటూ ప్రశ్నించిన సమయంలో నేను ఏమీ జ్యోతిష్యుడిని కాదు.. నాకు నా పెళ్లి
ఎప్పుడు జరుగుతుంది అనే విషయం తెలియదు. ఒక వేళ ఆ విషయం కనుక నాకు తెలిస్తే
ఖచ్చితంగా మీకు చెప్తాను అన్నాడు. కియారా తో ప్రేమ విషయమై స్పందించాలని
కోరగా మా ఇద్దరి మద్య ప్రేమ లేనే లేదు అంటూ స్పష్టంగా చెప్పేశాడు.
ప్రస్తుతం ఇద్దరం కూడా సినిమా లతో బిజీగా ఉన్నాం. ఇద్దరం కథలు కలిసి వస్తే
తప్పకుండా మళ్లీ మళ్లీ నటించేందుకు సిద్దంగానే ఉన్నాం. అయినా మా ఇద్దరి
మద్య వ్యవహారం విషయంలో మీడియా అత్యుత్సాహంకు నాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు.
కియారా
బాలీవుడ్ లో వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. తెలుగు లో
భరత్ అనే నేను చిత్రంలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వినయ విధేయ రామ
సినిమాలో నటించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ కు గ్యాప్
తీసుకుంది. ఎట్టకేలకు మళ్లీ రామ్ చరణ్ తో సినిమాను చేసేందుకు సిద్దం
అయ్యింది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ సినిమాకు గాను
కియారా అద్వానీ ఎంపిక అయ్యింది. ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.
తెలుగు లోనే కాకుండా హిందీలో కూడా ఈమె సినిమాలను చేస్తూ వస్తోంది.
ఎన్టీఆర్ కు జోడీగా ఈమెను ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ
ఎన్టీఆర్30 కోసం కియారా మరియు ఆలియా భట్ ను పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో
ఒకరు ఎన్టీఆర్ కు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన వచ్చే
వరకు వెయిట్ చేయాల్సి ఉంది. భారీ పారితోషికం అందుకుంటూ మోస్ట్ క్రేజీ
బ్యూటీగా దూసుకు పోతున్న ఈ సమయంలో ఖచ్చితంగా కియారా అద్వానీ ప్రేమ పెళ్లి
అంటూ కెరీర్ ను నాశనం చేసుకోదు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం ఉన్నా కూడా
అయిదు ఆరు సంవత్సరాల వరకు అది బయట పడకుండానే ఉంచాలని భావిస్తూ ఉంటారని
కామెంట్స్ వినిపిస్తున్నాయి.