కియరా అద్వాణీ పరిచయం అవసరం లేదు. మహేష్ సరసన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన కియరా ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. ప్రస్తుతం చరణ్ సరసన ఆర్.సి 15లో నటిస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అటు బాలీవుడ్ లోను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
కియరా కెరీర్ స్పీడ్ కొనసాగుతున్న క్రమంలోనే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సిద్ధార్థ్ వర్క్ కమిట్ మెంట్లతో బిజీ అవ్వడం వల్ల హనీమూన్ ఆలస్యమైంది. అయితే ఇంతలోనే అతడు తన ప్రియసఖితో ఇదిగో ఇలా బీచ్ వెకేషన్ ని ప్లాన్ చేసాడు. బికినీ బీచ్ వేడుకల్లో కియరా ఫుల్ హ్యాపీ మూడ్ లో కనిపిస్తోంది. చూస్తుంటే నీలి సముద్రంలో సర్ఫింగ్ కి వెళ్లేందుకు కియరా అన్ని విధాలా ప్రిపేర్డ్ గా కనిపిస్తోంది.
కియారా స్మోకింగ్ హాట్ బీచ్ వేర్ తో ఆకర్షణీయమైన అవతార్ లో సర్ఫింగ్ బోర్డ్ ను పట్టుకుని ఇలా ఫోజులిచ్చింది. అద్భుతమైన ఈ లుక్ లో కియారా గ్లామర్ ఎలివేషన్ పై యూత్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పోస్ట్ కి 'బీచ్ ప్లీజ్' అని కియరా క్యాప్షన్ ఇచ్చింది. ఈ లుక్ లో టై అండ్ డై సరోంగ్ కి జోడీగా హాట్ వైట్ బాడీసూట్ లో కియరా అందాలు వేడెక్కిస్తున్నాయి.
కియారా ప్రతిసారీ బీచ్ వెకేషన్ ని అమితంగా ఇష్టపడుతుంది. జూలై 2021లో బోల్డ్ ఎల్లో బికినీలో ఉన్న ఫోటోను ఇటీవల కియరా షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. ఇది త్రోబాక్ ఫోటో అని తన పోస్ట్ లో పేర్కొంది. ఇంతలోనే మరోసారి బీచ్ వెకేషన్ లో సర్ఫింగ్ కి సిద్ధమైంది కియరా. ఇంతకీ కియరా ఫోజులు సరే.. ఆ సర్ఫింగ్ బోర్డ్ వెనక ఎవరున్నారు? అంటూ అభిమానులు చిలిపిగా కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల భూల్ భులయ్యా 2 (2022) -జగ్ జగ్ జీయో (2022) చిత్రాల్లో అద్భుత నటనతో ప్రశంసలు అందుకున్న కియరా షేర్ షా చిత్రంలో సిద్ధార్థ్ సరసన నటించింది. తదుపరి రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ఆర్.సి 15 పై భారీ హోప్స్ తో ఉంది. అలాగే సత్యప్రేమ్ కి కథ సినిమాలోను నటిస్తోంది.
ఈ చిత్రంలో భూల్ భులయ్య 2 సహనటుడు కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా గ్రాండ్ వెడ్డింగ్ తర్వాతా తన కెరీర్ ని యధావిధిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తోంది. కియారా -సిద్ధార్థ్ 7 ఫిబ్రవరి 2023న జైపూర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు. కియారా ఇటీవల ముంబైలో జరిగిన మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ లో కూడా ప్రదర్శన ఇచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.