పూల్ లో బ్యూటీ ఇలా కళ్లు మూసుకుని

Sun Jan 16 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Kiara Advani Latest Photo

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. గ్లామర్ ఎలివేషన్స్ లో తనదైన మార్క్ వేస్తుంది. ఇన్ స్టా వేదికగా బ్యూటీ  హీట్ ని తట్టుకోవడం వీజీ ఏం కాదు. తాజాగా ఈసారి ఏకంగా భగభగమండిపోతున్న సూర్యుడ్ని సైతం తన అందాల్లో లాక్ చేసింది.  స్విమ్మింగ్ పూల్ లో బ్యూటీ ఇలా  కళ్లు మూసుకుని  ..అస్తమిస్తోన్న రవి కిరణాల్ని సైతం తనవైపు తిప్పుకుంది. మాల్దీవుల్లో బ్యూటీ కామెరాకి ఇచ్చిన ఫోజులు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోని ఉద్దేశించి `సీస్ ది డే` అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది . ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. నెటి జనులు ఆసక్తికర కామెంట్లతో  మరింత హీట్ పెంచుతున్నారు. నటి సమంత సైతం కియారాని ఇలా చూసి కామెంట్ చేయకుండా ఉండలేకపోయింది.  `వావ్` అని లవ్ సింబల్ ని పోస్ట్ చేసింది. ఇంకా పలువురు బాలీవుడ్ హీరోయిన్లు కామెంట్లు చేసారు. మాల్దీవులు కియారా ఫ్యావరెట్ వెకేషన్ స్పాట్. ఖాళీ సమయం దొరికితే ఒంటరిగా  మాల్దీవుల్లోనే  చిలౌట్ అవుతుంది.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన నటించడం ఇది రెండవసారి. గతంలో `వినయ విధేయ రామ`లో నటించింది. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. దానితో సంబంధం లేకుండా శంకర్ బ్యూటీని మళ్లీ ఎంపిక చేసారు. ఇక బాలీవవుడ్ లో ఇప్పడిప్పుడి  బిజీ హీరోయిన్ గా మారుతోంది.  ఆ మధ్య `షేర్ షా`తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.