Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ కియ‌రా స్టన్నింగ్ లుక్ వైర‌ల్

By:  Tupaki Desk   |   6 May 2021 3:30 AM GMT
రెడ్ హాట్ కియ‌రా స్టన్నింగ్ లుక్ వైర‌ల్
X
భ‌ర‌త్ అనే నేను- విన‌య విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన కియ‌రా అద్వాణీ త‌దుప‌రి మ‌హేష్ .. ఎన్టీఆర్.. చ‌ర‌ణ్‌ లాంటి స్టార్ల సర‌స‌న క్రేజీ చిత్రాల్లో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ కియారా బిజీ నాయిక‌గా వెలిగిపోతోంది.

త‌క్కువ స‌మ‌యంలో గొప్ప స్టార్ డ‌మ్ అందుకున్న నాయిక‌గా కియ‌రా పేరు మార్మోగుతోంది. ఇక ఈ భామ‌కు సోష‌ల్ మీడియాల్లోనూ అంతే గొప్ప ఫాలోయింగ్ పెరిగింది. ఇన్ స్టా వేదిక‌గా రెగ్యుల‌ర్ గా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది. స్పెష‌ల్ షూట్ల‌ను ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో కియ‌రా రెడ్ హాట్ ఫోటోషూట్లు వెబ్ లో సునామీ సృష్టించాయి. ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ఎరుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో కియ‌రా లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.