Begin typing your search above and press return to search.

18 వ‌య‌సుకే మ‌ర‌ణ‌శిక్ష‌ను ఎదుర్కొన్న వీరుడి క‌థ‌!

By:  Tupaki Desk   |   14 Aug 2022 5:26 AM GMT
18 వ‌య‌సుకే మ‌ర‌ణ‌శిక్ష‌ను ఎదుర్కొన్న వీరుడి క‌థ‌!
X
మొదటి పిన్న వయస్కుడైన స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఖుదీరామ్ జీవిత‌క‌థ‌ వెండితెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి `ఖుదీరామ్ బోస్` అనే టైటిల్ పెట్టారు. విద్యా సాగ‌ర్ రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. నాజ‌ర్ ఈ చిత్రంలో బాల గంగాధ‌ర్ తిల‌క్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. వివేక్ ఒబేరాయ్- అతుల్ కుల‌క‌ర్ణి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- బెంగాళీ - హిందీ భాషలలో తెర‌కెక్కి అత్యంత భారీగా విడుద‌ల కానుంది. ఈ పాన్ ఇండియా మూవీ టైటిల్ ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. తాజాగా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లై వైర‌ల్ గా మారింది.

రాకేష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మక ప్రయత్నంలో తొలిసారిగా నటించాడు. స్టంట్ డైరెక్టర్ కనల్ కణ్ణన్.. అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి.. కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ .. సంగీత దర్శకుడు మణి శర్మ అందరూ ఈ బ‌యోపిక్ కోసం ఓ వేదికపైకి వ‌చ్చారు. డైలాగ్ రైటర్ గా బాలాదిత్య.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కూడా టీమ్‌లో చేరారు.

భారత విముక్తి ఉద్యమం సృష్టించిన అతి పిన్న వయస్కుడైన స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఖుదీరామ్ బోస్ 1889లో జన్మించాడు. అతను చరిత్ర (హిస్ట‌రీ) అభిమానులకు పండితులకు ఆరాధ‌కుడు.. అత్యంత పాపుల‌రైన‌ ముజఫర్ పూర్ కుట్ర కేసులో బ్రిటిష్ రాజ్ అతన్ని దోషిగా నిర్ధారించి 1908లో మరణశిక్ష విధించాడు. ఖుదీరామ్ 18 సంవత్సరాల వయస్సులో చెక్కు చెద‌ర‌ని చిరునవ్వుతో ఉరిశిక్షను ఎదుర్కొన్నాడు. స్వాతంత్య్ర‌ ఉద్యమంలో అత్యంత పిన్న వయస్కుడైన అమరవీరులలో ఒకడిగా నిలిచాడు.

నూతన నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి ప్రతిభావంతులైన దర్శకుడు విద్యా సాగర్ రాజుతో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ బయోపిక్ ను జాగర్లమూడి పార్వతి సమర్పిస్తున్నారు. చ‌రిత్రలో నిలిచిపోయిన పోరాట యోధుడు.. ఒక రహస్య రత్నం క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.