Begin typing your search above and press return to search.

లుక్ టాక్: టీనేజీలోకి రివ‌ర్స్ గేర్ వేసిన `ఖిలాడీ` రాజా

By:  Tupaki Desk   |   18 Oct 2020 6:30 AM GMT
లుక్ టాక్: టీనేజీలోకి రివ‌ర్స్ గేర్ వేసిన `ఖిలాడీ` రాజా
X
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ త‌న‌పై వ‌చ్చిన అన్ని విమ‌ర్శ‌ల‌కు ప్రాక్టికల్ గానే చెక్ పెట్టేస్తున్నాడు. ఇదిగో ఈ గెట‌ప్పే అందుకు ప్రూఫ్. చూస్తుంటే ఇప్పుడే కాలేజ్ కి వెళుతున్న టీనేజీ కుర్రాడిలా క‌నిపించ‌డం లేదూ? ఆ టైట్ ఫిట్ నెక్ .. టైట్ ఫిట్ డెనిమ్స్ లో రాజాలోని మేకోవ‌ర్ చూస్తుంటే గాళ్స్ అంతే ప‌రేషాన్ అయిపోవడం గ్యారెంటీ.

ఇప్ప‌టికే క్రాక్ మూవీలో ర‌వితేజ అల్ట్రా స్మార్ట్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ర‌వివ‌ర్మ ఖిలాడీలోనూ అంత‌కంటే ఇస్మార్ట్ లుక్ తో ట్రీటివ్వ‌బోతున్నాడ‌ని తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ వెల్ల‌డిస్తోంది. టాప్ టు బాట‌మ్ బ్లాక్ లో దుమ్ము రేపాడు మాస్ రాజా.

తాజా చిత్రంలో రాజా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌న్న‌ది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. తాజాగా ఖిలాడీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల చేశారు. రాజా బిందాస్ పోజ్ తో అద‌ర‌గొడుతున్నాడు. ఇక ఖిలాడీ టైటిల్ కి త‌గ్గ‌ట్టే ప‌చ్చ‌నోట్లు నేప‌థ్యంలో అలా గాల్లోకి లేచాయి మ‌రి. ఇక ఈ మూవీ కూడా మైండ్ గేమ్ నేప‌థ్యంలో థ్రిల్ల‌ర్ త‌ర‌హా క‌థాంశంతో తెర‌కెక్కనుందిట‌. ప్ర‌త్య‌ర్థితో యుద్ధంలో విజయం సాధించడానికి స్మార్ట్ గేమ్ ఆడే కుర్రాడి క‌థ ఇద‌ని తెలుస్తోంది.

రాక్ష‌సుడు నిర్మాత సత్యనారాయణ కొనేరు ఈ ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్ ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి.. డింపుల్ హయతి కథానాయికలుగా న‌టిస్తున్నారు. ఎ స్టూడియోస్ సహకారంతో పెన్ స్టూడియోస్ - హవిష్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లూసిఫెర్ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తారు. ఈ శ‌నివారం సినిమా మొద‌లైంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభమవుతుంది.