Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'ఖైదీ' విలన్..!

By:  Tupaki Desk   |   30 Jun 2022 9:30 AM GMT
బాలీవుడ్‌ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఖైదీ విలన్..!
X
కోలీవుడ్‌ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 'పెరుమాన్' అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్జున్.. తన వాయిస్ తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత తెలుగులో 'ఆక్సిజన్' సినిమాలో నటించాడు.

లైఫ్ టైం సెటిల్మెంట్ అంటూ 'ఖైదీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దాస్. 'అంధకారం' మూవీతో ఆకట్టుకున్న అర్జున్ దాస్.. 'మాస్టర్' సినిమాలో త‌న యాక్టింగ్‌ తో అద‌ర‌గొట్టాడు.

రీసెంట్‌ గా వ‌చ్చిన 'విక్ర‌మ్' చిత్రంలోనూ మెరిసాడు. తెలుగు తమిళ ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు.. ఇప్పుడు స్ట్రెయిట్ హిందీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని అర్జున్ ధ్రువీకరించారు.

2017లో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అంగ‌మ‌లై డైరీస్' అనే క్రైం డ్రామాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అర్జున్ దాస్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

'ఎంగిర కరుప్పుదురై' ఫేమ్ మధుమిత సుందరరామన్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నారు. ఇది దర్శకుడుకి హిందీ డెబ్యూ మూవీ కావడం గమనార్హం. అబండ‌న్షియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ లో ఈ చిత్రం రూపొందనుంది.

అబండ‌న్షియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా 'సూరరై పోట్రు' హిందీ రీమేక్ ను సూర్య తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అర్జున్ దాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారు.

ఇకపోతే అర్జున్ దాస్ ప్రస్తుతం 'అనీతి' మరియు 'కుంకి 2' వంటి తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలానే లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న 'ఖైదీ 2' సినిమాలోనూ భాగం కానున్నాడు. ఇక ఆలస్యమవుతూ వస్తోన్న విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' చిత్రంలోనూ అర్జున్ కీలక పాత్ర పోషించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో 'కప్పెల' తెలుగు రీమేక్ ను గతేడాది లాంచ్ చేశారు. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.