భల్లాలుడికి నో చెప్పిన మహానటి!

Tue Sep 17 2019 13:45:17 GMT+0530 (IST)

Keerthy Suresh says No to Rana Daggubati?

బ్రేక్ అంటే ఏంటి? ఒక వాహనం నడుపుతూ చేత్తోనో కాలితోనో నొక్కేది.. తొక్కేది  బ్రేక్.  సినిమాలు వరసగా ఫట్ అవుతుంటే హీరోలు తీసుకొనే బ్రేక్ ఇంకోటి. మరో బ్రేక్ ఏంటంటే సక్సెస్ కోసం అష్టకష్టాలు పడి 1000 సార్లు ఫెయిలైన ఎడిసన్ కు 1001 సారి బల్బు వెలుగుతుంది చూడండి అది బ్రేక్. ఆ బల్బును నేలకేసి కొడితే అయ్యేది కూడా బ్రేక్.  ఇక హీరో హీరోయిన్లకు సూపర్ సక్సెస్.. గుర్తింపు ఒక్క సినిమా తో వస్తుంది.  అది కూడా ఒక బ్రేక్.  ఈ లాస్ట్ బ్రేక్ కనుక వస్తే హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ స్టొరీ సెలెక్షన్ మారిపోతుంది.  ఎక్కువ ఆఫర్లు వస్తాయి కాబట్టి వాటిలో నుంచి కథలను ఆచితూచి ఎంపిక చేసుకుంటారు.  నచ్చని వాటికి నో చెప్పేస్తారు. ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి కూడా అలానే ఉందట.  'మహానటి' తో కీర్తికి భారీ బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే అప్పటినుంచి కీర్తి సెలెక్షన్ మారిపోయింది.  చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటోంది.  చాలా సినిమాలకు నో చెప్తోందట.  రీసెంట్ గా రానా దగ్గుబాటి సినిమాకు కూడా నో చెప్పిందని సమాచారం.

రానా త్వరలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.  ఇది ఒక కొరియన్ సినిమాకు రీమేక్ అని.. ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పటికే రానా తీసుకున్నాడని సమాచారం.  ఈ సినిమా కథ మాఫియా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కీర్తిని సంప్రదిస్తే ఆఫర్ కు నో చెప్పిందని టాక్.  ఏ కారణం వల్ల కీర్తి ఈ ఆఫర్ కు నో చెప్పిందనేది మాత్రం తెలీదు.  దీంతో నందిని రెడ్డి టీమ్ మరో సూటబుల్ హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నారట.