Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్, విజయ్ డేటింగ్.. ఎంతవరకు నిజం?

By:  Tupaki Desk   |   25 Jan 2023 8:00 AM GMT
కీర్తి సురేష్, విజయ్ డేటింగ్.. ఎంతవరకు నిజం?
X
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త బయటకు వస్తుందో.. అందులో నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోవాలంటే చాలానే కష్టపడాల్సి వస్తుంది. అందుకు కారణం ఎక్కువగా ఫేక్ న్యూస్ రావడమే. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి నిజం ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోపే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తోంది. గ్లామర్ ఫీల్డ్ కావడంతో హీరో హీరోయిన్ల మధ్య ఎప్పుడూ డేటింగ్, ప్రేమ, బ్రేకప్.. అంటూ తెగ వార్తలు వస్తుంటాయి. ఇలా ఇప్పటి వరకు చాలా మందిపై పుకార్లు వచ్చాయి. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్, హీరో విజయ్ దళపతి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తమిళ నాట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొన్న మొన్నటి వరకు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. అవి కాస్త తగ్గాయి అనుకునేలోపు... వాటికి కొనసాగింపుగా కీర్తి సురేష్ తో.. విజయ్ దళపతి ప్రేమాయణం అంటూ హెడ్డింగులు పుట్టుకొస్తున్నాయి. అంతే కాదండోయ్ జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేసి విజయ్ ను ఫుల్ టార్గెట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ వల్లే విజయ్, సంగీతల మధ్య గొడవ వచ్చిందని.. అందుకే వారు విడాకులు తీసుకోబోతున్నారని ఎవరికి నచ్చినట్లుగా వారు రాసుకున్నారు.

కానీ ఈ వార్తలన్నీ అబద్ధాలే అని తెలుస్తోంది. గతంలో విజయ్, కీర్తి కలిసి భైరవ, సర్కార్ సినిమాల్లో నటించారు. విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కొత్త సినిమాలో కూడా కీర్తి హీరోయిన్ గా చేయబోతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి షూటింగ్ లో ఉండగా తీసిన ఫొటోలనే నెట్టింట వైరల్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఫేక్ యే అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండు, మూడు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు కాదని.. అలాగే వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఇలా తప్పుగా ప్రచారం చేయొద్దని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా సంక్రాంతికి వచ్చిన విజయ్ వారిసు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

ఈ క్రమంలోనే కొందరు యాంటీ ప్యాన్స్ ఆయనను టార్గెట్ చేసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్యా లాంటి ప్రేమ, డేటింగ్ లేదని చాలా మంది కొట్టి పడేస్తున్నారు. ఇలాంటి వార్తలను ప్రజలెవరూ నమ్మొద్దని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.