`కేజీఎఫ్` బ్యానర్లో మహానటి లేడీ ఓరియేంటెడ్!

Sun Aug 14 2022 16:06:27 GMT+0530 (India Standard Time)

Keerthy Suresh New Movie In KGF Banner

`మహానటి` సక్సెస్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్. ఆ సక్సెస్ తో కీర్తి ప్రతిష్టలు మరింత పె రిగాయి. కానీ ఆ క్రేజ్ ని టాలీవుడ్ లో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. మహానటి విజయంతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదుగుతుందని భావించారంతా. కానీ అందుకు భిన్నమైన సన్నివేశం కనిపించింది.ఆ సినిమా తర్వాత కోలీవుడ్ లో ఎక్కువగా  సినిమాలు చేసింది తప్ప టాలీవుడ్ లో ఆ వేగం కనిపించలేదు. గ్లామరస్ పాత్రలకు సిద్దంగా లేకపోవడమే కీర్తి ని వెనక్కి నెట్టినట్లు కనిపించింది. ఇదే సమయంలో `మిస్ ఇండియా`..`గుడ్ లక్ సఖి` లాంటి మరో రెండు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందకొచ్చింది గానీ  వాటి ఫలితాలు ప్రతికూలంగానే వచ్చాయి.

దీంతో అమ్మడి కెరీర్ మరింత డైలమాకి గురైంది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశం వదులుకోవడం దేనికని రియలైజ్ అయింది. ఆ వెంటనే కోలీవుడ్..టాలీవుడ్..మాలీవుడ్ అంటూ మూడు భాషల్లోనూ  ఎడాపెడా సినిమాలు చేసింది. ఇటీవలే `సర్కారు వారి పాట`తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఆ కమర్శియల్ సక్సెస్ రెండు..మూడు అవకాశాలకు దారులు చూపింది.

ఈ నేపథ్యంలో తాజాగా కీర్తీ సురేష్ తో పాన్ ఇండియా బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ భారీ లేడీ  ఓరియేంటెడ్ చిత్రాన్ని  నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.  `గురు`..`ఆకాశమే నీ హద్దురా` చిత్రాలకు దర్శకురాలిగా పనిచేసిన సుధ కొంగర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కథ ఏంటి? అన్నది ఇంకా బయటకు రాలేదు గానీ హోంబలే ఫిల్మ్స్  మాత్రం పాన్ ఇండియాలో చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

కీర్తికి మాలీవుడ్...కోలీవుడ్...టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. శాండిల్ వుడ్ ..బాలీవుడ్ లో ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ లేడీ ఓరియేంటెడ్ చిత్రంతో ఆ రెండు భాషల్లో కూడా హోంబలే ఈ చిత్రంతో లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు  తెలుస్తోంది. `కేజీఎఫ్` హిట్ తో హోంబలేకి ఇండియావైడ్ గుర్తింపు దక్కింది. సౌత్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే సంస్థగా పేరుగాంచింది.

ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` నిర్మిస్తుంది. అటుపై యంగ్  టైగర్ ఎన్టీఆర్ తో మరో పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. మరింత మంది టాలీవుడ్ స్టార్లు ఆ బ్యానర్లో సినిమాలు చేయాలని క్యూలో చేస్తున్నారు. అలాంటి బ్యానర్లో  కీర్తికి ఛాన్స్ అంటే?  నక్క తోక తొక్కినట్లే. లక్కీ గాళ్ అనే అనాలి మరి.