కుందనపు బొమ్మకు జెరాక్స్ కాపీలా ఉంది!

Tue Sep 21 2021 10:00:01 GMT+0530 (IST)

Keerthy Suresh Latest Photo

కుందనపు బొమ్మకు మరు రూపంలా ఉంది! ఎవరీ భామ..!  ఇంకెవారు.. అందాల కీర్తి సురేష్. బాపు బొమ్మ.. బుట్ట బొమ్మ..! అంటూ ముంబై బ్యూటీ పూజా హెగ్డేని పొగిడేస్తున్నారు కానీ.. అంతకుముందే దక్షిణాది కీర్తికి యువతరం హృదయాల్లో ఎదురే లేని స్థానం దక్కింది. కానీ దానిని స్టార్ డమ్ వైపు మరల్చడంలోనే లక్ కలిసి రాలేదు. నటి మేనక వారసురాలిగా ఘనమైన ఆరంగేట్రాన్ని చాటుకున్న కీర్తి బాలనటిగానూ సుపరిచితం. మహానటి గా కీర్తి నీరాజనాలు అందుకుంది.ఇక ఇటీవల వరుసగా ఫోటోషూట్లతో ఘనకీర్తిని ఆర్జిస్తోంది. ఇతర నాయికలతో పోలిస్తే కీర్తి సురేష్ గ్లామర్ హద్దులు మీరదు. పద్ధతిగా సాంప్రదాయ బద్ధమైన గెటప్ తోనే కనిపిస్తోంది. ఇక బుట్టబొమ్మగా పాపులరైన పూజా హెగ్డేకి భిన్నమైన ఆహార్యం కీర్తి సొంతం. అందుకే ఇప్పుడు మహేష్ సరసన సర్కార్ వారి పాట చిత్రంలో అవకాశం అందుకుంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో కీర్తి లుక్ కూడా ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. నవయువకుడిగా మారిపోయిన మహేష్ సరసన కీర్తి ఎంతో మ్యాచింగ్ గా కనిపిస్తోంది. అయితే మూవీలో మాస్ ని మెప్పించే హాట్ కంటెంట్ కోసం పరశురామ్ ఐటమ్ బ్యూటీని దించేందుకు ఆస్కారం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మండే బ్లూస్ పేరుతో తాజాగా కీర్తి షేర్ చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది.