ఎట్టకేలకు కీర్తి మొహంలో విజయానందం

Sat Apr 01 2023 11:11:52 GMT+0530 (India Standard Time)

Keerthy Suresh Happy With Dasara Success

తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో కూడా చాలా చిత్రాలతో నటించి మెప్పించింది. ముఖ్యంగా మహానటి చిత్రంతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ వరుసగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహానటి సినిమా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదని విషయం వాస్తవం.కొన్ని సినిమాలు కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినా ఆమె పాత్ర పరంగా మాత్రం అభిమానులు సంతృప్తి చెందలేదు.. ఆమె కూడా ఇప్పటి వరకు మహానటి స్థాయిలో సక్సెస్ రాలేదని.. ఇంకా తనని మహానటి హీరోయిన్ గానే పిలుస్తున్నారని ఒకింత అసహనంతో ఉంది.

ఎట్టకేలకు దసరా చిత్రంలో వెన్నెల పాత్రలో నటించి మైమరిపించింది. హీరో నాని పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఆమె పాత్ర ఉండడంతో పాటు ఆ పాత్రలో అద్భుతమైన నటనతో కీర్తి సురేష్ అలరించింది.

ఆ పాత్ర కేవలం కీర్తి సురేష్ మాత్రమే చేయగలదు మరే హీరోయిన్ చేసిన కూడా దసరా సినిమా ఈ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకునేది కాదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి దసరా విజయంతో చాలా కాలంగా కీర్తి సురేష్ మొహంలో కనిపించని విజయానందం కనిపిస్తుంది. దసరా సక్సెస్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సందడి చేసిన కీర్తి సురేష్ పార్టీలో పాల్గొన్న సమయంలో చాలా సంతోషంగా కనిపించిందని యూనిట్ సభ్యులు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

కీర్తి సురేష్ ఇక నుంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటే వరుసగా సక్సెస్ లను దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.