Begin typing your search above and press return to search.

కీర్తితో పేడ కలిపించారట

By:  Tupaki Desk   |   24 March 2023 1:00 PM GMT
కీర్తితో పేడ కలిపించారట
X
కీర్తి సురేష్ సరైన హిట్ అందుకొని చాలా కాలమే అయింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ హిట్టు లభించలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ దసరా సినిమా విషయంలోనే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

సినిమా ఇంకా విడుదల కూడా అవ్వకుండానే సినిమా యూనిట్లో పనిచేసిన 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంచింది అంటే సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

అయితే ఈ సినిమా కోసం తన చేత పేడ కూడా కల్పించారు అనే విషయాన్ని తాజాగా కీర్తి సురేష్ బయటపెట్టింది. దసరా సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్లి సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది.

అయితే తాజాగా సినిమా యూనిట్ తో యాంకర్ సుమా చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన క్లిప్స్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

అదేమిటంటే తనను అంత ఈజీగా ఏమీ సెలెక్ట్ చేయలేదని తన లుక్ టెస్ట్ కోసం తన చేత పేడ కనిపించారని చెప్పుకొచ్చింది. ముందుగా ముగ్గు వేయించి బావి నుంచి నీళ్లు తోడించి ఆ తర్వాత పేడ కల్పించారని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాని కల్పించుకుని ఆమెకు నిజం పేడ ఇవ్వాలా లేక ఆర్ట్ డైరెక్టర్ సిద్ధం చేసిన పేడ లాంటి పదార్థం ఇవ్వాలా అని అనుకుంటున్న సమయంలో డైరెక్టర్ పేడ ఇవ్వమని అన్నారని కీర్తి సురేష్ ఏమిటి ఏమి ఆలోచించకుండా వెళ్లి పేడ కలిపిన విధానం చూస్తే ఈమె హీరోయిన్ కాక ముందు ఏం చేసేది అని మాకే డౌట్ వచ్చిందని అంటూ నవ్వులు పూయించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.