Begin typing your search above and press return to search.

దసరాకు ఆరు రోజులు చెప్పిందట కీర్తి..!

By:  Tupaki Desk   |   26 March 2023 11:00 AM GMT
దసరాకు ఆరు రోజులు చెప్పిందట కీర్తి..!
X
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని ధరణిగా.. కీర్తి సురేష్ వెన్నెలగా నటించారు. ఈ క్రమంలోనే నానితో పాటు కీర్తి కూడా సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్ లు విసురుతూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం తాను అసోసియేట్ డైరెక్టర్, ఒక ప్రొఫెసర్ నుండి శిక్షణ తీసుకున్నట్లు నటి చెబుతోంది.

అయితే దసరా సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్లు వివరించింది. దాదాపు 6 రోజుల పాటు ఈ చిత్రం కోసం డబ్బింగ్ చెప్పానని వివరించింది. అయితే తాను గతంలో చేసిన సినిమాలకు 3 రోజులకు మించి పట్టలేదని గుర్తు చేసింది. ఈ ఒక్క చిత్రానికి మాత్రమే రెట్టింపు సమయం తీసుకున్నట్లు వివరించింది. అంతేకాకుండా బొగ్గు గనుల గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా... అక్కడ చాలా దుమ్ము, ధూళి ఉండేదని కీర్తి వివరించింది.

అలాంటి పరిస్థితుల్లో తనకు మేకప్ వేయడానికి, తీయడానికి చాలా సమయం పట్టేదని చెప్పింది. అంతేకాకుండా మొదట్లో తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు పలకడం తనకు కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. కానీ తాను నేర్చుకొని మరీ ఈ డైలాగ్ లు చెప్పినట్లు స్పష్టం చేసింది. తన కెరియర్ లోనే వెన్నెల క్యారెక్టర్ మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని.. దీనికి ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేసింది.

మహానటి సినిమా చేస్తున్నప్పుడు తాను ఎలాగైతే ఫీలయిందో.. ఈ చిత్రం చేస్తున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయినట్లు వివరించింది. అప్పుడు సావిత్రి క్యారెక్టర్ తో, ఇప్పుడు వెన్నెల క్యారెక్టర్ తో తనకు ఎమోషనల్ కనెక్టివిటీ అనుభవించినట్లు వెల్లడించింది. నేను లోకల్ తర్వాత.. నానితో కలిసి మరోసారి పని చేయడం తనకు బాగా నచ్చిందని పేర్కొంది.

అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అద్భుతమైన దర్శకుడు అని కీర్తి సురేష్ చెప్పింది. సినిమా చూసిన తర్వాత అది అతని మొదటి రచనగా మనకు అనిపించదని... భవిష్యత్తులో కూడా శ్రీకాంత్ ఓదెల తప్పకుండా గొప్ప సినిమాలు తీస్తాడని చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.