బూతు పదంతో రసూల్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన కీరవాణి..!

Tue Jul 05 2022 22:32:23 GMT+0530 (IST)

Keeravani Counter Tweet On Resul Pookutty

ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకుట్టి ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని రసూల్ ఒక 'గే లవ్ స్టోరీ'గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.రసూల్ పోకుట్టి ట్వీట్ కు స్పందిస్తూ 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. RRR సినిమా ఒక గే లవ్ స్టోరీ అని తాను భావించడం లేదని.. ఒకవేళ అది గే లవ్ స్టోరీ అయినా అందులో తప్పేముందని ట్వీట్ చేశారు. దాన్ని మీరెలా సమర్థిస్తారని ప్రశ్నించిన శోభు.. నీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు రావడం నిజంగా శోచనీయమని అన్నారు.

ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణి సైతం రసూల్ కామెంట్స్ పై స్పందించారు. శోభు ట్వీట్ ని కోట్ చేస్తూ.. అసభ్య పదజాలంతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కీరవాణి చేసిన ఆ ట్వీట్ ని కొద్ది సేపటికే డిలీట్ చేయడం గమనార్హం.

అయితే అప్పటికే క్రీమ్ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్లు దాన్ని నెట్టింట వైరల్ చేశారు. అందరూ రసూల్ పోకుట్టి ట్రోల్ చేస్తుంటే.. దీని కోసం కీరవాణి అన్‌పార్లమెంటరీ భాషను ఎంచుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆ ట్వీట్ ని తొలగించారని అర్థం అవుతుంది

కీరవాణి ట్వీట్ చేస్తూ.. ''అక్షరాలను టైప్ చేసేటప్పుడు నేను అప్పర్ కేస్ మరియు లోయర్ కేస్ లెటర్స్ ను ఉపయోగించడం నాకు రాకపోవచ్చు. కాని నేను రసూల్ పూకుట్టితో సహా ప్రతి వ్యక్తి యొక్క భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తాను'' అని పేర్కొన్నారు. అయితే ఇందులో ఓ తెలుగు బూతు పదం వచ్చేలా అప్పర్ కేస్ లెటర్స్ తో హైలైట్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రసూల్ ఇంటిపేరు 'పోకుట్టి' ని కీరవాణి అసభ్యకరమైన అర్థం వచ్చేలా హైలైట్ చేసి టైప్ చేశారు. కౌంటర్ ఇవ్వడం వరకూ ఒకే కానీ.. ఇలా బూతులు ఉపయోగించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మ్యూజిక్ కంపోజర్ వెంటనే ఆ ట్వీట్ ని తొలగించారు. ఈ క్రమంలో మరో ట్వీట్ చేస్తూ 'నేను ఇప్పుడిప్పుడే టైప్ చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టాను' అని కీరవాణి పేర్కొన్నారు. దీన్ని కూడా ఆయన వెంటనే డిలీట్ చేయడం గమనార్హం.