Begin typing your search above and press return to search.

క‌త్తిని రాజా కుమ్మితే ప‌వన్ ఫ్యాన్స్ కేంట‌ట‌?

By:  Tupaki Desk   |   14 Jan 2021 11:38 AM GMT
క‌త్తిని రాజా కుమ్మితే ప‌వన్ ఫ్యాన్స్ కేంట‌ట‌?
X
ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ క‌త్తి మ‌హేష్ ఎపిసోడ్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. జ‌న‌సేనానిగా రాజ‌కీయాల్లో ఉన్న ప‌వ‌న్ ని అవ‌మానిస్తూ క‌త్తి మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఫ్యాన్స్ ఓ రేంజులోనే వీరంగ‌మాడారు. కోడిగుడ్ల‌తో దాడికి స‌న్నాహాలు చేసారు. అదంతా గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలో క‌త్తిపై ప‌వ‌న్ అభిమానులు వేరొక ర‌కంగా క‌సి తీర్చుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ సంక్రాంతి కానుక‌గా రిలీజైన క్రాక్ మూవీలో ర‌వితేజ... క‌త్తిని ఇర‌గ కుమ్ముతాడు. వీపు మీద పిరుదుల మీద లాఠీతో ఇర‌గదీస్తాడు కాప్ రాజా. అయితే ఆ కుమ్ముడికి మాస్ రాజా ఎంత ఆనంద‌గా ఉన్నారో తెలీదు కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు‌.

పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ల్లో దీనికి త‌మ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మహేష్ కత్తి `క్రాక్` సీన్ పై పవర్ ‌స్టార్ అభిమాని పోస్ట్ ఇంట్రెస్టింగ్. మహేష్ కత్తి ఎపిసోడ్ లో పవర్ స్టార్ మౌనంగా ఉన్నాడు. కాని మాస్ మహారాజా కాదు. చివరికి నా పగ నెరవేరింది అంటూ ఒక అభిమాని ఆనందం వ్య‌క్తం చేయ‌గా.. మరొక పోస్ట్ లో ``రవితేజ మేము మహేష్ కత్తికి సరిగ్గా పండ‌గ‌ చేయాలనుకున్నది చూసాము`` అంటూ వ్యాఖ్యానించారు. ``రవితేజ ఒక చిరంజీవి అభిమాని. కాబట్టి అతను పవన్ కళ్యాణ్ వైపు సాఫ్ట్ కార్న‌ర్ తో ఉంటాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పవన్ కళ్యాణ్ ను ఇష్టపడతారు. ప్రతీకారం తీర్చుకోవటానికి హీరో అండ్ డైరెక్ట‌ర్ మహేష్ కత్తి కోసం ఒక పాత్రను సృష్టించారు. క‌త్తిని కుళ్ల బొడ‌వ‌డానికి పీకే అభిమానులను సంతృప్తి పరచడానికి మాత్రమే ఇది`` అంటూ జ‌రిగిన వాస్త‌వాన్ని వ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేశాడో వీరాభిమాని. ఓవ‌రాల్ గా పీకే ఫ్యాన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ ను ర‌వితేజ‌-గోపిచంద్ బృందం అందుకున్నార‌ని దీనిని బ‌ట్టి ప్రూవైంది. క్రాక్ మ‌రో నాలుగైదు రోజుల్లో సేఫ్ జోన్ కి వ‌చ్చేస్తోంద‌న్న సంతోష‌క‌ర వార్త‌ను సెల‌బ్రేట్ చేసుకుంటోంది చిత్ర‌బృందం.