మగాళ్లకు కత్రిన బస్తీ మే సవాల్

Thu Dec 05 2019 18:43:51 GMT+0530 (IST)

Katrina Kaif Workout Video Viral In Social Media

సెలబ్రిటీ లైఫ్ లో ఫిట్ నెస్ ప్రాధాన్యత చాలా ఎక్కువ. వయసు మీద పడినా దానిని కవర్ చేయాలంటే?  ఫిట్ నెస్ తప్పనిసరి. అందులో హీరోయిన్లు అయితే ఇంకా జాగ్రత్తలు తప్పనిసరి. గ్లామర్ ఎలివేషన్ లోనూ... అప్ డేట్ అవుతూ ఉండాలి. నిరంతరం రూపలావణ్యాన్ని కాపాడుకోగలగాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలం. అందుకే బాలీవుడ్ హీరోయిన్లు ఫిట్ నెస్ విషయంలో  ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు. యోగా- జిమ్ దినచర్యలో భాగంగా ఆచరిస్తారు.ఫిట్ నెస్ లో కత్రిన కైఫ్ పర్ఫెక్ట్ అన్న సంగతి తెలిసిందే. జిమ్ముల్లో నిరంతరం కసరత్తులు చేసే ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూనే ఉంది. తాజాగా జిమ్ చేస్తున్న కొత్త  ఫోటోలు- వీడియోలు బయటకు వచ్చాయి. 35 ఏళ్ల వయసులోనూ కత్రినా జిమ్ములో హీటెక్కిస్తోంది. తన సహచరులుకే సవాల్ విసిరడమే గాక.. ఎవరి దమ్మెంతో చూస్కుందామా? అంటూ సవాల్ విసురుతోంది. జిమ్ లో మేల్ సహచరులకే సవాల్ విసిరి షాకిచ్చింది. ఎనర్జిటిక్ బోయ్స్ తో పోటీ పడుతూ ఏకంగా ఎనిమిది బస్కీలు ఆపకుండా చేసింది. దీంతో ఆ పక్కన ఉన్నవారంతా  కత్రినా  స్టామినాకు షాక్ కు గురయ్యారు. ఇంకా జిమ్ములో వాళ్లకి పోటీగా ఎన్నో బరువులు ఎత్తింది. ఇది చూసిన జిమ్ము కోచ్  సైతం అవాక్కాయ్యాడు.  మరి కత్రినానా! మజాకానా?

క్యాట్ పట్టుదలను మెచ్చని వాళ్లే లేరు. సోషల్ మీడియా వేదికగా కత్రినపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  నటనపట్ల అంకిత భావంతో  పనిచేసే వాళ్లంతా తప్పకుండా ఇలాంటి వాటిని అలవాటు చేసుకోవాలని యువతరానికి పలువురు నెటిజనులు సూచించారు. ఆ విషయంలో కత్రిన స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానించారు. ఇంత డెడికేషన్ ఉన్న  హీరోయిన్ కాబట్టి ఆసియా మోస్ట్ డిజైర్డ్ ఉమెన్ గా కత్రిన ఖ్యాతి ఘడించింది. 35 ఏళ్ల వయసులోనూ ఎవరితో అయినా పోటీ పడుతోంది. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి