కత్రిన టోన్డ్ ఫిట్ బాడీ వెనక కఠోర నగ్నసత్యం

Sat Dec 05 2020 10:00:01 GMT+0530 (IST)

Katrina Kaif Talking About Her Body Fitness

పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో ఫిట్ గా కనిపించే కత్రిన అందం ఆరోగ్యం తీరైన రూపం వెనక అసలు రహస్యం ఏమిటో లీకైపోయింది. ఆ మనోహరమైన ధేధీప్యమానమైన రూపలావణ్యం వెనక ఓ షాడో దాగి ఉంది. ఆ షాడో గురించి తనే స్వయంగా ఓపెనైంది. `గంట సేమ్ జిమ్మింగ్ యోగా సెషన్స్` తన రూపం వెనక అసలు మ్యాజిక్ అని చెబుతోంది.కత్రిన కైఫ్ తన వ్యాయామ దినచర్యను తాజాగా అభిమానులతో పంచుకున్నారు.  ఆశించిన రూపం దక్కాలంటే ఎవరైనా ఇది పాటించాల్సిందేనంటూ తన ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు.

ఆమె తన వ్యాయామ శిక్షకుడు ఇచ్చిన చేతి రాత వ్యాయామ దినచర్యను షేర్ చేసింది.  ఇందులో  కాళ్ళు.. యాబ్స్ .. పై(అప్పర్) శరీరానికి సంబంధించిన వ్యాయామాల వివరాలు ఉన్నాయి. వీటిలో స్క్వాట్స్.. లెగ్ ప్రెస్స్.. పుష్-అప్స్.. కార్డియోలు ఇతర వర్కవుట్లలో ఉన్నాయి.

ఒక రోజు కోసం వర్కౌట్ డేటా ఇది! అని కత్రిన తన ధృవీకరించిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసింది. కత్రినా వర్కౌట్ విషయానికి వస్తే చాలా క్రమశిక్షణతో కూడుకున్నది .. తరచూ ఆమె వ్యాయామ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కత్రిన తదుపరి రోహిత్ శెట్టి కాప్ యాక్షన్ డ్రామా `సూర్యవంశీ`లో అక్షయ్ కుమార్ సరసన నటించింది. సిద్ధాంత్ చతుర్వేది - ఇషాన్ ఖట్టర్ లతో కలిసి  హారర్ కామెడీ `ఫోన్ భూత్`లో నటిస్తోంది.