Begin typing your search above and press return to search.

క‌త్రిన సీక్రెట్ పెళ్లి నిజ‌మా

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:30 PM GMT
క‌త్రిన సీక్రెట్ పెళ్లి నిజ‌మా
X
గ‌త కొంత‌కాలంగా క‌త్రిన కైఫ్ కొత్త ప్రేమాయ‌ణం హాట్ టాపిక్ గా మారింది. స‌ల్మాన్ ఖాన్‌ తో సుదీర్ఘ‌ ప్రేమాయ‌ణం సాగించి అటుపై బ్రేక‌ప్ చెప్పేశాక‌.. ఆ త‌ర్వాతా ర‌ణ‌బీర్ తో ల‌వ్ లో ప‌డి నాలుగేళ్ల త‌ర్వాత‌ బ్రేక‌ప్ చెప్పేసింది. గ‌త కొంత‌కాలంగా సింగిల్ స్టాట‌స్ తోనే ఉంది. ప్ర‌స్తుతం యూరి ఫేం విక్కీ కౌశ‌ల్ తో క‌త్రిన నిండా ప్రేమ‌లో మునిగింద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ ఇద్ద‌రూ క‌లిసి జంట‌గా న‌టించ‌నున్నారు. అంత‌కంటే ముందే ఇద్ద‌రి మ‌ధ్యా ర్యాపో కుదిరింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. సీక్రెట్ గా గుట్టు మ‌ట్టుగా ఆ ఇద్ద‌రూ అప్పుడ‌ప్పుడు పార్టీల పేరుతో క‌లుసుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

స‌డెన్ గా క‌త్రిన నేటి ఉద‌యం ఊహించ‌ని ట్విస్టిచ్చింది. వ‌ధువు గెట‌ప్ తో ప్ర‌త్య‌క్ష‌మై పెద్ద షాకిచ్చింది. ఈ గెట‌ప్ చూశాక‌.. ఒక‌వేళ పెళ్లి చేసుకుందా? అంటూ అభిమానులు కంగారు ప‌డ్డారు. అయితే అస‌లు విష‌యంలోకి వెళితే.. క‌త్రిన ప్ర‌స్తుతం ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టిస్తోంది. ఈ ప్ర‌క‌ట‌న‌లో బిగ్ బి అమితాబ్ - జ‌యా బ‌చ్చ‌న్ జంట‌తో పాటు కింగ్ నాగార్జున .. ప్ర‌భు .. రాజ్ కుమార్ త‌దిత‌రులు న‌టించారు.

బంగారు వ‌జ్రాభ‌ర‌ణాల షోరూమ్ కి సంబంధించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న ఇది. ఇందులో క‌త్రిన బ్రైడ‌ల్ వేర్ కి ప్ర‌మోష‌న్ చేస్తుంది. ఇక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో అమితాబ్- జ‌యాబ‌చ్చ‌న్ జంట క‌త్రిన‌కు త‌ల్లిదండ్రులుగా క‌నిపిస్తే నాగార్జున‌- ప్రభు- శివ‌రాజ్ కుమార్ వంటి వారు పెళ్లి అతిధులుగా క‌నిపిస్తార‌ట‌. బంగారం దుకాణానికి తెలుగులో నాగార్జున‌.. త‌మిళంలో ప్ర‌భు.. క‌న్న‌డ‌లో శివ‌రాజ్‌కుమార్ ప్ర‌చారక‌ర్త‌లుగా కొన‌సాగుతున్నారు. అందుకే ఇంత భారీగా ప్లాన్ చేసారు క్రియేటివ్ టీమ్. వీళ్లంద‌రినీ యాడ్ షూట్ కోసం ఓ చోట చేర్చి పెళ్లి ప్రిప‌రేష‌న్ కి సంబంధించిన దుస్తులు తొడిగేయ‌డంతో అంతా ఖంగు తింటున్నారు. ప్ర‌క‌ట‌న క్రియేటివ్ గా బాగానే ప్లాన్ చేశారు కానీ.. నిజంగానే క‌త్రిన‌కు పెళ్లయిపోయిందేమోన‌ని జ‌నాలు మాత్రం కంగారు ప‌డ్డారు.