ఇండియాలో వన్ అండ్ ఓన్లీ సూపర్ గర్ల్ ఈవిడే

Tue Sep 29 2020 19:30:35 GMT+0530 (IST)

 Katrina Kaif Latest Stunning Pose

సూపర్ గర్ల్ అన్న పదానికి డెఫినిషన్ ఇవ్వాల్సి వస్తే .. ఇండియా వరకూ పరిశీలిస్తే వన్ అండ్ ఓన్లీ సూపర్ గర్ల్ కత్రిన కైఫ్ నే. ఇక్కడ సూపర్ హీరో సిరీస్ తెరకెక్కిస్తే దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకునే నాయిక ఎవరు? అంటే కచ్ఛితంగా కత్రిన పేరే పరిశీలనకు వెళుతుందేమో.ఇక కత్రిన ట్రాక్ రికార్డ్ చూస్తే ధూమ్ 3 మొదలు ఇటీవలి `టైగర్ జిందా హై` వరకూ అదిరిపోయే యాక్షన్ తో కట్టిపడేసింది. యాక్షన్ సినిమాలకు పర్ఫెక్ట్ ఫిట్ బాడీ. అంతకుమించి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న కథానాయికగానూ గుర్తింపు ఉంది. తాజాగా సూపర్ ఉమెన్ తరహా స్పోర్ట్స్ డ్రెస్ లో ప్రత్యక్షమై షాకిచ్చింది కత్రిన. పింక్ కాంబినేషన్ తో దేహశిరుల్ని అతుక్కుపోయే టైట్ అథ్లెట్ డ్రెస్ లో కత్రిన ఛమక్కుమనిపించింది.

కెరీర్ సంగతి చూస్తే.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.. జీరో .. భారత్ చిత్రాల్లో నటించింది కత్రిన. ఇవన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. గత రెండేళ్లుగా కత్రినకు ఏదీ కలిసి రాలేదు. ఆ క్రమంలోనే కె బ్రాండ్ పేరుతో సౌందర్య సాధనాల ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. ఓవైపు బిజినెస్ .. మరోవైపు నటన. ప్రస్తుతం సూర్యవంవీ- ఫోన్ బూత్ అనే రెండు చిత్రాల్లో కత్రిన నటిస్తోంది.