నయా లుక్కులో ఆకట్టుకుంటున్న బాలయ్య భామ!!

Thu Jul 16 2020 23:00:01 GMT+0530 (IST)

Katrina Impressive Look

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. ఉత్తరాదితో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేదు. నిజానికి కైఫ్ పేరులోనే మత్తెక్కించే కైపు ఉంది. కత్రినా అందాల మత్తులో అభిమానులు అలా తేలిపోతూ ఉంటారు. కత్రినా పేరుకు తగ్గట్టుగానే కత్తిలాంటి ఫిగర్ మెయింటైన్ చేస్తుంది. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి మంచి సక్సెస్ రేట్ ఉంది. స్టార్ హీరోలు సల్మాన్.. రణబీర్ కపూర్ లతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ అయి మళ్లీ సింగిల్ అయింది. ఈ భామ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఇలా ఫోటోషూట్లతో అభిమానుల గుండెలను కొల్లగొడుతుంది. కత్రినా ఏ మూవీ చేసినా అందులో అసలు మొహమాటంలేని అందాల ఆరబోత కనిపిస్తుంది. ఈ సుందరి మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తెలుగు హృదయాలను దోచుకుని మళ్లీ నందమూరి బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు సినిమాలో నటించింది. అదే అమ్మడి చివరి తెలుగు సినిమా.ఎందుకో తెలియదు గాని మళ్లీ ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపించలేదు. కట్ చేస్తే అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. నిజానికి ట్రెడిషనల్ అయినా బికినీ అయినా రెడీ అంటూ రెచ్చిపోతోంది. ఇక తాజాగా బ్లాక్ డ్రెస్ లో అమ్మడి అందాలు మాములుగా రచ్చ చేయట్లేదు. ఈరోజు కత్రినా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫేర్ వారు ట్విట్టర్లో కత్రినా కొత్త బ్లాక్ డ్రెస్ పోజు పోస్ట్ చేస్తూ విష్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు కొత్త హీరోయిన్ల రాకతో కత్రినా కాస్త తక్కువగా కనిపిస్తుంది. మళ్లీ ఈ మధ్యే వరుసగా షారుక్ సల్మాన్ అమీర్ సినిమాల్లో నటించింది. కానీ ఈ ముగ్గురి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అవకాశాలు తగ్గినట్లే అనిపిస్తుంది. దాంతో చేసేదేం లేక ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా.. అక్షయ్ కుమార్ సరసన కత్రినా నటించిన సూర్యవంశీ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తుపాకీ తరపున కత్రినాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.