ఫొటోటాక్ : మాల్దీవుల్లో కొత్త పెళ్లి కూతురు రిలాక్స్

Mon Jan 24 2022 20:01:55 GMT+0530 (IST)

Katrina Flaunts Her Stunning Curves In Maldives

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ ఇటీవలే బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి పెళ్లి చాలా వైభవంగా జరిగింది. పెళ్లి అయిన వెంటనే వీరిద్దరు హనీమూన్ కు విదేశాలకు వెళ్తారు అనుకుంటూ అనూహ్యంగా పెళ్లి అయిన రెండవ వారంలోనే షూటింగ్ కు వెళ్లారు. ఇద్దరు కూడా పని పట్ల చూపించిన నిబద్దతకు అంతా కూడా హ్యాట్సాఫ్ చెప్పారు. అదే సమయంలో వారిద్దరి యొక్క డబ్బు సంపాదనకు విమర్శలు కూడా కురిపించారు. మొత్తానికి కత్రీనా మరియు విక్కీ కౌశల్ గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ప్రస్తుతం కత్రీనా కైఫ్ మాల్దీవుల్లో ఉన్నట్లుగా ఫొటోలు షేర్ చేసింది. అందాల వింధు చేస్తూ క్లీ వేజ్ షో తో ఆమె షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి అయిన కొత్తలో ఇలా ఒంటరిగా మాల్దీవులకు వెళ్లడం ఎందుకు అంటూ కొందరు ఆమె ను ప్రశ్నిస్తుంటే మరి కొందరు ఆమెను ఎందుకు ఒంటరిగా వెళ్లారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫొటోలో లేనంత మాత్రాన విక్కీ కౌశల్ మాల్దీవులకు వెళ్లినట్లు కాదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పక్కన విక్కీ కౌశల్ ఉన్నాడా లేదా అనేది తెలియదు కాని ప్రస్తుతం ఈ ఫొటోలు మాత్రం మరోసారి ఆమెను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నాయి.

మాల్దీవుల్లో ఈ హాట్ బ్యూటీ చేస్తున్న రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల్లో ఈ అమ్మడి కొత్త ఫొటోలు రెగ్యులర్ కంటే ఈసారి స్పెషల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు మాదిరిగా బికినీలో కాకుండా కాస్త పద్దతిగానే కత్రీనా ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చూస్తుంటే పెళ్లి తర్వాత ఆమె ఆలోచన తీరు లో మార్పు వచ్చింది. పెళ్లి యొక్క మహాత్యమే అది కదా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కత్రీనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో ఆమె ఇప్పటికి ఉంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ స్టార్స్ కు జోడీగా ఆమె ఇప్పటికి సినిమాల్లో ఎంపిక అవుతూనే ఉంది.