వైరస్ బెంబేలెత్తిస్తున్నా కార్తికేయ టీమ్ సాహసం

Sun Jun 07 2020 12:52:55 GMT+0530 (IST)

Kartikeya Team Adventure

మహమ్మారీ ప్రకంపనాలతో విదేశీ ప్రయాణాలు ఎంత రిస్కీగా మారాయో తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించినా భయాందోళనలు జనాన్ని వీడే పరిస్థితి లేదు. అత్యవసరం అనుకుంటేనే ప్రయాణం. లేదంటే లోకల్ గా ఏదో ఒకటి చూస్కోవడమే. అనేక దేశాలలో లాక్ డౌన్ కారణంగా కొనసాగుతున్న ప్రయాణ ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినోద పరిశ్రమలకు తీవ్ర విఘాతంగా మారాయి. చిత్రనిర్మాతలపై కొన్ని నెలల పాటు విదేశీ షూటింగులను రద్దు చేసుకోవాలనే ఒత్తిడి ఉంది. అయితే కొందరు నిర్మాతలు మాత్రం కథ డిమాండ్ ప్రకారం విదేశాలలో షూట్ చేయాలనే డేర్ చేస్తుండడం  హాట్ టాపిక్ గా మారింది.
 
అలాంటి గట్స్ తో డేర్ చేస్తోంది `కార్తికేయ 2` టీమ్. దర్శకుడు చందూ మొండేటి అతని బృందం విదేశీ షూటింగుకి రెడీ అవుతుండడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. తాజా సీక్వెల్ మూవీ కీలక షెడ్యూల్ ని కంబోడియా పరిసరాల్లోని రీస్ లో చిత్రీకరించనున్నారట. చందూ టీమ్ ఇందుకోసం సౌత్ ఈస్ట్ ఆసియా దేశానికి లొకేషన్ అనుమతుల కోసం వెళుతున్నారట.



కార్తికేయ 2లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కలర్స్ స్వాతి ఓ కీలక పాత్రల్లో నటించనుంది. అభిషేక్ పిక్చర్స్ - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.  స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాన్సెప్ట్  మూవీలో హైలెట్ గా ఆకట్టుకుంటాయని సమాచారం.