Begin typing your search above and press return to search.

సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతున్న యంగ్ హీరో...!

By:  Tupaki Desk   |   27 May 2020 12:25 PM GMT
సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతున్న యంగ్ హీరో...!
X
యువ హీరో కార్తికేయ 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'Rx 100' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో మ‌నోడు మాస్ ఇమేజ్ అంటూ ఆ త‌రువాత ట్రై చేసిన 'గుణ 369' 'హిప్పీ' సినిమాలు వ‌రుస‌పెట్టి ఫ్లాప్స్ అయిన విషయం తెలిసిందే. 'గుణ 369' మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా కార్తికేయకు నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. వెంటనే నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఎలాంటి పాత్రలైనా చేయగలనని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన '90 ఎమ్.ఎల్' కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. కాకపోతే థియేటర్స్ లో అంతగా ఆదరణ దక్కించుకోని '90 ఎమ్.ఎల్' సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ సాధించింది.

'Rx 100' తరువాత ఆ స్థాయి హిట్ కార్తికేయ అందుకోలేదనే చెప్పవచ్చు. అయితే కార్తికేయ అదృష్టం బాగుండడంతో బడా ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ లో 'చావు క‌బురు చ‌ల్ల‌గా' అనే సినిమా ఓకే అవ్వ‌డం.. ఆ వెంట‌నే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డం జ‌రిగిపోయాయి. కాకపోతే దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగ్ ఆగిపోయింది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. మాస్ గెట్ అప్ లో ఈ మూవీలో కార్తికేయ కనిపించనున్నాడని అర్థం అవుతుంది.

ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ యంగ్ హీరో తన బాడీ ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు తాజాగా అతను సిక్స్ ప్యాక్ లుక్ తో కేక పుట్టిస్తున్నాడు. చొక్కాలేకుండా తన బాడీని చూపిస్తూ అమ్మాయిల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ''లాక్ డౌన్ మా ప్రణాళికలను మార్చింది.. కానీ ఇది మా లక్ష్యాలను ప్రభావితం చేయదు'' అంటూ తన సిక్స్ ప్యాక్ ఫోటోలను పోస్ట్ చేసాడు. ఇప్పుడు కార్తికేయ బేర్ బాడీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.