శంకర్ కూతురు సినిమాకు డేట్ ఫిక్స్!

Thu May 19 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Karthi Viruman On August 31st

వెండితెరపై వారసుల హవా కొనసాగుతూనే వుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ.. ఇలా ఏ భాషలో  తీసుకున్నా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరోల లేదా హీరోయిన్ ల నిర్మాతల దర్శకుల వారుసులు తెరంగేట్రం చేస్తూ తమ సత్తాని చాటుకుంటున్నారు. ఇదిలా వుంటే ఈ మధ్య దర్శకుల వారసులు హీరోలుగా  హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. తండ్రి క్రేజ్ ని కొనసాగిస్తూ తమ కంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ జాబితాలో స్టార్ డైరెక్టర్ శంకర్ ముద్దుల కూతురు అదితి శంకర్ తమిళ చిత్రంతో హీరోయిన్ గా  తెరంగేట్రం చేస్తోంది.కార్తీ హీరోగా నటిస్తున్న మూవీ `విరుమన్`.  2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ద్వారానే శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో కార్తీ గ్రామీణ యువకుడిగా మాసీవ్ పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రకాష్ రాజ్ రాజ్ కిరణ్ శరణ్య ఇంద్రజ భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా సింగంపులి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మూవీ రిలీజ్ డేట్ ని హీరో కార్తీ బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేస్తున్నామని హీరో కార్తి ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు. ఆరెంజ్ కలర్ షర్ట్ లుంగీ కళ్లకు గాగుల్స్ ధరించి డాపర్ కూల్ గా కనిపిస్తూ పోతరాజు కత్తి పట్టుకుని వున్న కార్తి లుక్ ఆకట్టుకుంటోంది.

తిరునాళ్ల వాతావరణం మధ్య చిరునవ్వులు చిందిస్తూ కార్తీ కనిపించిన లుక్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ ముద్దుల కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో పాటు టాప్ సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని మధురైలో అత్యధిక భాగం చిత్రీకరించారు. తొలి చిత్రం `పరుత్తి వీరన్` తరువాత అంటే దాదాపు 14 ఏళ్ల విరామం అనంతరం కార్తీ ఈ మూవీ కోసం మధురై వెళ్లడం విశేషం.