పడకగది రహస్యాన్ని పబ్లిగ్గా లీక్ చేసిన స్టార్ హీరోయిన్

Wed Apr 21 2021 08:00:02 GMT+0530 (IST)

Kareena Kapoor reveals bedroom secrets with Saif

బెబో కరీనా కపూర్ ఖాన్ ఇటీవలే తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 40ఏళ్ల కరీనా 50 ఏళ్ల సైఫ్ సంసార జీవనం ఎంతో ఆదర్శమయం అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఇక ఈ జంట చాలా విషయాల్లో దాపరికం అన్నదే లేకుండా ఓపెనవుతున్న తీరు ఆసక్తికరం. తాజాగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రకరకాల రహస్యాల్ని బహిర్గతం చేసింది ఈ జంట.పడక గదిలో మూడు ఇష్టమైన సంగతులేవి? అన్న కరణ్ ప్రశ్నకు.. బెడ్ రూమ్ లో అడుగుపెట్టే ముందు ఓ వైన్ బాటిల్- పైజామా- సైఫ్ ఖాన్ ఈ మూడు నాతోనే..!! అంటూ కరీనా ఎంతో బోల్డ్ గా చెప్పడం అభిమానులకు షాకిచ్చింది. ఆన్సర్ ఇచ్చాను కాబట్టి తప్పకుండా గిఫ్ట్ హాంపర్ ఇవ్వాల్సిందే! అంటూ కరణ్ వెంట పడ్డారు బెబో.

అలాగే బయట దేవతా సుందరిలా కనిపించే కరీనా ఇంట్లో ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు సైఫ్ ఇచ్చిన ఆన్సర్ ఆసక్తిని కలిగించింది. మోకాళ్ల పైకి పైజామాను ధరించి పాత టీషర్ట్ తొడుక్కుంటుందని పోనీటెయిల్ తరహాలో తలకట్టును ముడి వేస్తుందని సైఫ్ వెల్లడించారు. మొత్తానికి ఆలు మగల బెడ్ రూమ్ రహస్యాలు వ్యక్తిగత రహస్యాలు అలా ఓపెనయ్యయి. పబ్లిక్ వేదికపై బెబో ఏమాత్రం తడుముకోకుండా అలాంటి ఆన్సర్ ఇచ్చేయడం అభిమానులను నిజంగానే సర్ ప్రైజ్ చేసింది