Begin typing your search above and press return to search.

నెపోటిజం పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు ...!

By:  Tupaki Desk   |   5 Aug 2020 11:30 PM GMT
నెపోటిజం పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు ...!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన బయట వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ ఇస్తుంటారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను వెల్లడిస్తున్నారు. తాజాగా కపూర్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై స్పందించింది.

కాగా కరీనా మాట్లాడుతూ.. ''మనం సిచ్యుయేషన్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించం.. ఒక ప్రత్యేకమైన బ్యాగ్రౌండ్ నుండి వచ్చినవారైతే చాలు దాడి చేయాలి అనేదానికి అలవాటు పడ్డాము. అయితే బ్యాగౌండ్ వల్లే ఈ పేరు, కీర్తి, డబ్బు, సక్సెస్ వచ్చాయని అనడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే నేను 21 సంవత్సరాల నా కెరీర్‌ కు నెపోటిజం మాత్రమే కారణం కాదు. అది అసలు పాజిబుల్ కూడా కాదు. ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్స్ వారసత్వంగా వచ్చిన వారు స్టార్స్ గా నిలబడలేదు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. అది వారి ఆలోచన. అయితే దాని మీద ఎవరూ డిస్కషన్ చేయరు. బాలీవుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి అందరూ దీని వైపు చూస్తారు'' అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ''ఇండస్ట్రీలో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. కానీ నా స్ట్రగుల్ 10 రూపాయలు జేబులో పెట్టుకొని ట్రైన్ ఎక్కి వచ్చివారిలా ఉండదు. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. మమ్మల్ని స్టార్‌ లను చేసింది ప్రేక్షకులే. ఇంకెవరూ కాదు. నెపోటిజం స్టార్స్ సినిమాలు చూడొద్దు అనుకుంటే చూడకండి.. వారి సినిమాలు చూడమని ఎవరూ ఫోర్స్ చేయరు కదా?. అక్షయ్ కుమార్ - షారూక్ ఖాన్ - ఆయుష్మాన్ ఖురానా - రాజ్‌ కుమార్ రావు వంటి ఎందరో పెద్ద స్టార్స్ బయటి నుంచి వచ్చిన వారే. కానీ వాళ్ళందరూ సక్సెస్ ఫుల్ యాక్టర్స్ అనిపించుకున్నారు. వారి కష్టపడేతత్వమే వారిని స్టార్లను చేసింది. అలియా భట్ అయినా కరీనా కపూర్ అయినా ఇంకెవరైనా కష్టపడితేనే ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. మేం సరిగ్గా నటించకపోతే వారే రిజెక్ట్ చేస్తారు'' అని కరీనా పేర్కొంది.