ఇంట్లో వేసుకోవాల్సిన నైటీతో బయటకు వచ్చావేంటి?

Sun Dec 05 2021 07:00:02 GMT+0530 (India Standard Time)

Kareena Kapoor Outfit Troll

సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా నీరాజనాలు అందుకుంటారు.. అదే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటారు. లక్షల మంది అభిమానులు కలిగి ఉండే సెలబ్రెటీలు కొద్ది మంది హేటర్స్ ను కూడా కలిగి ఉంటారు. ఆ హేటర్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. చిన్న పాయింట్ ఏమైనా దొరికితే ఉతికి ఆరేసేందుకు వారు సిద్దంగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమెను విమర్శించే వారు కూడా చాలా మందే ఉంటారు. ఆమె తాజాగా భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ఇలా బ్లాక్ డ్రస్ లో వచ్చింది. ఆమె డ్రస్ పై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సినిమాల్లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదించారు కదా మేడమ్.. మరీ ఇలా నైట్ టైమ్ లో ఇంట్లో వేసుకునే నైటీని ఇలా బయటకు ఎందుకు వేసుకుని వచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గుతున్నా కొద్ది మీ ఔట్ ఫిట్ క్వాలిటీ తగ్గిస్తూ వస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి ఆమె బ్లాక్ డ్రస్ పై చాలా నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇలా సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ ను ట్రోల్స్ ను ఎదుర్కోవడం కరీనాకు కొత్తేం కాదు. కాని ఈసారి ఆమె డ్రస్ కాస్త ఎక్కువ ట్రోల్స్ కు గురి అవుతుంది. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆమె పట్టించుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరీనా కపూర్ ఇప్పుడు కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. భర్త సైఫ్ అలీ ఖాన్ తో పోటీ అన్నట్లుగా ఈమె సినిమాలు తెరకెక్కుతున్నాయి. గత ఏడాది ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కరీనా కరోనా వల్ల ఈ ఏడాది సినిమాలు ఏమీ విడుదల చేయలేక పోయింది. కాని వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు ఈమె నుండి వస్తాయని తెలుస్తోంది. పెళ్లి పిల్లలు అయిన తర్వాత హీరోయిన్ గా ఇంత బిజీగా ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అందుకే కరీనా కపూర్ చాలా స్పెషల్ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ముందు ముందు కూడా హాట్ ఐటెం సాంగ్స్ తోనూ కరీనా అలరించేందుకు సిద్దంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.