వారసురాళ్లే టార్గెట్ గా కరణ్ బ్యానర్ వేగం!

Sun Aug 14 2022 23:00:01 GMT+0530 (IST)

Karan Johar Busy in Introducing Star Kids

ఎక్కడైనా సరే?  అప్ డేట్ తప్పనిసరి. ట్రెండ్ ని ఫాలో అవ్వాల్సిందే. లేదంటే రేసులో వెనుకబడే ప్రమాదముంది. ఇలాంటి వాటని అనుసరించడంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ముందుంటారు. సినిమాలే కాదు..మనిషి సైతం ఎంతో ట్రెండీగా ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడుతుంటారు. ట్రెండ్ ని పాలో చేయడమే కాదు.అవసరమైతే అదే స్టైల్లో ట్రెండ్ ని సైతం సెట్ చేయగల సమర్ధుడు. అంతటి సమర్ధుడు కాబట్టే? ఎంతో మంది వారసుల్ని బాలీవుడ్ కి పరిచయం చేసే బాధ్యతలు తీసుకుంటున్నారు. 'ధడక్' చిత్రంతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ ని పరిచయం చేసింది కరణ్ ఓహార్  అన్న సంగ తి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ లో లాంచ్ అయింది.

అటుపై సైప్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ని కూడా అదే బ్యానర్లో లాంచ్ చేయాలని కరణ్ ప్రయత్నించారు. కానీ అప్పటికే  ప్రగ్యా కపూర్..అభిషేక్ కపూర్ కర్చీప్ వేయడంతో సాధ్య పడలేదు. అయినా సారా తో రెండవ చిత్రం 'సింబ' బాధ్యతలు మాత్రం కరణ్ తీసుకున్నారు. అలా స్టార్ కిడ్స్ విషయంలో కరణ్ అభిమానం చాటుకున్నారు.

తాజాగా కరణ్ ఇద్దరు నవ నాయికలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే జాన్వీ రెండు సినిమాలకు కరణ్ బ్యానర్లో సంతకాలు చేసింది. తాజాగా సారా అలీఖాన్ సైతం అదే బ్యానర్లో మరో రెండు కొత్త సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.

మొదటి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు  కరణ్ రివీల్ చేసారు. సారా-జాన్వీలతో వేర్వేరుగా సినిమాలు చేస్తున్న కరణ్ ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపించేలా ఇదే సమయంలో ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి.

ప్రస్తుతం సారా  1942 క్విట్ ఇండియా ఉద్యమం ఆధారంగా తెరక్కిస్తున్న  చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి  కన్నయ్య అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా విక్కీ కౌశల్ తో ఓ సినిమా  చేస్తుంది. దీనికి ఉట్టేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక   జాన్వీ కపూర్ 'మిలీ'..'మిస్టర్ ఆనంద్ మిసెస్ మహి'..'బవాల్' చిత్రాల్లో నటిస్తోంది.