కరణ్ జీవితాన్ని కెలికితే టాక్ షో హైలైట్!

Mon Dec 05 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Karan Johar Biopic Talk Show Highlight!

బాలీవుడ్ లో మళ్లీ బయోపిక్ లు జోరందుకుంటోన్న సంగతి తెలిసిందే. క్రీడాకురులతో పాటు ప్రముఖ వ్యక్తుల కథలన్నింటిని ఒక్కోక్కటిగా తెరపైకి తెస్తున్నారు. కోవిడ్ కి ఏడాది ముందు వరుసగా ఇదే తరహాలో తెరకెక్కాయి. అటుపై ఒక్కసారిగా జీవిత కథల వేడి తగ్గింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతోన్న కమర్శియల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించడంలేదు.ఈ నేపథ్యంలో నయా మేకర్స్ అంతా  బయోపిక్ లపై పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా  ప్రముఖ దర్శక-నిర్మాత..హోస్ట్ ప్రజెంటర్ కరణ్ జోహార్ జీవిత కథని కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు  మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహర్ వెల్లడించడం విశేషం. తన జీవిత కథని సినిమాగా మార్చే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని..తన పాత్రకి ఓ హీరోని కూడా రెడీ చేసినట్లు తెలిపారు.

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అయితే తన పాత్రకు పూర్తి న్యాయం చేగలరని స్పష్టం చేసారు. మరి దీనికి దర్శకత్వం వహించే బాధ్యతలు ఎవరికి ఇస్తారు? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. తన కథ కాబట్టి తానే స్వయంగా డైరెక్ట్చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ లో  కరణ్ స్టార్ మేకర్ గా కొనసాగుతున్నారు. కమర్శియల్ చిత్రాలతో పాటు వివిథ్యమై సినిమాలు చేస్తున్నారు.

అయితే ఆ మధ్య దర్శకత్వం పై  ఆసక్తి తగ్గించి సీరియస్ గా నిర్మాణంపైనే దృష్టిపెట్టారు. కానీ ఇటీవల తాను మళ్లీ డైరెక్టర్ గా బిజీ అవుతున్నారు. ఈనేపథ్యంలో కరణ్ కథని తానే స్వయంగా  డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. కరణ్  బయోపిక్ అంటే వ్యక్తిగతంగా చాలా వివాదాస్పద అంశాలుండే అవకాశం ఉంది. కాపీ విత్ కరణ్ టాక్ షోనే ఆయన స్టారోని మించిన పాపులారిటీ దక్కించుకున్నారు.

ఎఫైర్లు దగ్గర నుంచి డెబ్ రూమ్ లో శృంగార జీవితం వరకూ ప్రతీ అంశాన్ని టచ్ చేసే డేరింగ్ హోస్ట్ అతను. టాక్ షో మొదలైన దగ్గర నుంచి  ఇలాంటి వన్ని కెలికితే చాలా విషయాలే బయటపడుతాయి.

దర్శక-నిర్మాతగా ఆయన ప్రయాణం కంటే అసలైన కంటెంట్ అంటా ఆ టాక్ షోలోనే ఉందన్నది విశ్లేషకుల అంచనా. సినిమాకి బజ్ తీసుకొచ్చే అంశం కూడా అదే. ఈ నేపథ్యంలో కరణ్ బయోపిక్ కెలికితే బాలీవుడ్  లో కొందరి గుండెళ్లు రైళ్లు రన్నింగ్ చేయడం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.