Begin typing your search above and press return to search.

కాంతార మరో రికార్డు, ఇప్పుడు బుల్లితెరపై

By:  Tupaki Desk   |   2 Feb 2023 10:00 PM GMT
కాంతార మరో రికార్డు, ఇప్పుడు బుల్లితెరపై
X
థియేటర్లలో, డిజిటల్ వేదికలపై సూపర్ డూపర్ హిట్ కొట్టిన కాంతార ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదెక్కడో కాదు మన టీవీల్లో. స్టార్ మా లో ప్రసారమైన కాంతార మూవీకి అర్బన్ మార్కెట్ లో ఏకంగా 12.35 రేటింగ్ వచ్చింది. తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో కాంతార ఒకటిగా నిలిచింది. థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న కాంతార సినిమా బుల్లితెరపైనా సత్తా చాటింది.

గత వారం ఈ సినిమా కన్నడలో స్టార్ సువర్ణ ఛానల్ లో టెలికాస్ట్ అయింది. అక్కడ ఏకంగా 15.8 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. శాండల్ వుడ్ లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా కాంతార రికార్డు క్రియేట్ చేసింది.

చిన్న సినిమాగా వచ్చిన కాంతార భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథకు, టేకింగ్ కు కేవలం దక్షిణాది ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేవలం 16 కోట్ల వ్యయంతో కాంతార సినిమాను హోంబలే ఫిల్స్మ్ తెరకెక్కించింది. అయితే వరల్డ్ వైడ్ గా కాంతార ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు రిషబ్ శెట్టి. సినిమాలో శివ అనే ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి నటనకు అందరూ ఫిదా అయ్యారు. సినిమా క్లైమాక్స్ లో అతను చేసిన నటనకు ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే.

డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కాంతార సినిమాకు రిషబ్ శెట్టి తన ప్రాణం పెట్టాడు. అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. భూతకోళ అనే కళ నేపథ్యంలో కాంతార సినిమా తెరకెక్కింది.

కాంతార సినిమాకు మరో హైలెట్ సంగీతం అనే చెప్పాలి. అజ్నీష్ లోక్ నాథ్ మ్యూజిక్ కాంతార సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో లీనమయ్యేలా చేసింది. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ సినిమా మొత్తానికి హైలెట్ గా ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కారణంగా కాంతార సూపర్ హిట్ గా నిలిచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.