Begin typing your search above and press return to search.

కన్నడ ఇండస్ట్రీ అరాచకం.. ఓకే ఏడాదిలో ఊహించని కలెక్షన్స్

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:30 PM GMT
కన్నడ ఇండస్ట్రీ అరాచకం.. ఓకే ఏడాదిలో ఊహించని కలెక్షన్స్
X
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అతిపెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆస్వాదించే విధంగా అలవాటు పడుతూ ఉండడం మంచి విశేషం అని చెప్పాలి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ తర్వాత ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమంలో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి.

ఈ ఏడాది ముఖ్యంగా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలో నాలుగు విడుదలయ్యాయి. ఒకప్పుడు 50 కోట్లు అంటేనే అక్కడ పెద్ద ఆశ్చర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కన్నడ చిత్ర పరిశ్రమ కూడా సౌత్ ఇండస్ట్రీలో ఒక అగ్ర సినిమా పరిశ్రమగా ఎదుగుతోంది.

ఇక ఈ ఏడాది మంచి విజయాలను అందుకున్న కన్నడ సినిమాలో 4 సినిమాలపై ఒక లుక్కువేస్తే.. KGF చాప్టర్: 2 ప్రపంచవ్యాప్తంగా రూ. రూ. 1250 కోట్లు. కలెక్ట్ చేసింది. దీని ముందున్న KGF చాప్టర్: చాప్టర్ 1 2018లో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా 250 కోట్లకు పైగా సంపాదనతో రెండవ స్థానంలో ఉంది.

ఇక పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం జేమ్స్ 150 కోట్లకు పైగా కలెక్షన్లతో మూడవ స్థానంలో ఉంది. కిచ్చా సుదీప్ తాజా యాక్షన్ థ్రిల్లర్ విక్రాంత్ రోనా దాదాపు 150 కోట్ల వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంది. రక్షిత్ శెట్టి యొక్క 777 చార్లీ 100 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి ఐదవ స్థానంలో ఉంది.

ఆ విధంగా, 2022 శాండల్‌వుడ్‌కు అత్యంత సంపన్నమైన సంవత్సరంగా మారింది. మరియు దేశంలోని అత్యంత విజయవంతమైన చిత్ర పరిశ్రమలలో ఒకటిగా నిలిచింది. త్వరలోనే మరికొన్ని పెద్ద సినిమాలు కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రాబోతున్నాయి. ఇక ఆ సినిమా పరిశ్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ప్రభాస్ తో అతిపెద్ద సినిమా సలార్ ను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.