Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై కన్నడ దర్శకుల స్పెషల్ ఫోకస్

By:  Tupaki Desk   |   27 March 2023 8:00 AM GMT
టాలీవుడ్ పై కన్నడ దర్శకుల స్పెషల్ ఫోకస్
X
ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలు తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. పాన్ ఇండియా కల్చర్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ హీరోలు అందరూ కూడా హై వోల్టేజ్ యాక్షన్ కథలతో దేశవ్యాప్తంగా అందరికీ రీచ్ అయ్యి యూనివర్సల్ కంటెంట్ తో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులకి కూడా ఇతర భాష హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ లభిస్తుంది.

ఇప్పటికే తమిళ దర్శకులు టాలీవుడ్ హీరోలతో మూవీస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు నాగ చైతన్యతో కస్టడీ మూవీ చేస్తున్నాడు. అలాగే తెలుగు దర్శకులు కూడా ఇప్పుడిప్పుడే తమిళ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సార్ మూవీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే సినిమాని కెవి అనుదీప్ తెరకెక్కించారు.

ఇక బింబిసారతో సూపర్ సక్సెస్ అందుకున్న మల్లిడి వశిష్ఠ రజనీకాంత్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కన్నడ దర్శకులు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవకాశాలు సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఇప్పటికే కేజిఎఫ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అయిన ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కూడా సినిమాలు చేయడానికి లైన్ రెడీ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత తారక్ తో ఒక సినిమా ఉండబోతుంది.

అది కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ తో కూడా సినిమా ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ శిష్యుడుగా కన్నడ ఇండస్ట్రీలో నర్తన్ మఫ్తీ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

ప్రస్తుతం ఈ దర్శకుడు శివరాజ్ కుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడు కూడా తెలుగులో రామ్ చరణ్ తో మూవీ చేసే ఆఫర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా వేద అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కన్నడ దర్శకుడు ఏ హర్ష తెలుగులో గోపీచంద్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాని కేకే రాధా మోహన్ నిర్మించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం సినిమా అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఇలా కన్నడలో సక్సెస్ అయిన యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు సొంతం చేసుకుంటూ విశేషమని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.